Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీళ్లు, కండరాల నొప్పులు: జాయింట్స్ మధ్యలో ఉండే సినోవియల్ జెల్ ప్రోటీన్స్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. వాటి ద్వారా కండరాలు ఉత్తేజం అవుతాయి. ప్రోటీన్స్ స్థాయి శరీరంలో పడిపోయినప్పుడు కీళ్లు, కండరాల నొప్పుల సమస్య మొదలవుతుంది.
అలసిపోవడం: ప్రోటీన్ లెవెల్స్ తక్కువగా ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. త్వరగా చిరాకు పడటం, మానసికంగా ఒత్తిడికి లోనవడం, అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నిద్రపోలేకపోవడం: ఎప్పుడైతే మన శరీరంలో ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయో నిద్రపట్టడం చాలా కష్టమవుతుంది. నిద్రపట్టక మధ్య రాత్రుల్లో లేవడం కూడా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఎక్కువగా స్వీట్స్ తీసుకోవడం. చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతతను కోల్పోతుంది.
బ్రెయిన్ ఫంక్షన్: ప్రోటీన్స్ తక్కువైనప్పుడు మెదడు పనితీరు కూడా తగ్గిపోతుంది. ప్రొటీన్స్ ద్వారా న్యూరో ట్రాన్స్మిట్స్ పనిచేస్తాయి. కాబట్టి ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీంతో ఎలాంటి పని అయినా సులువుగా చేయవచ్చు.
బరువు తగ్గాలంటే: ప్రొటీన్స్ జీర్ణక్రియ శక్తిని పెంచుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. కాబట్టి ప్రొటీన్స్ పుష్కలంగా అందించే ఆహారాన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల స్లిమ్‌గా, ఎనర్జిటిక్‌గా తయారవుతారు.