Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలిజబెత్-1
(7 సెప్టెంబర్, 1533 - 24మార్చి, 1603)
ఇంగ్లాండ్ రాచరికంలో ఎందరో మహారాజులు, మహారాణులు ఉన్నా వారిలో కొంతమంది కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది. అలాంటి వారిలో ఎలిజబెత్ -! 1 ఒకరు. అనేక నాటకీయ పరిణామాలు జరిగిన తర్వాత 25ఏండ్ల వయసులో ఆమె ఇంగ్లాండ్ రాణిగా పట్టాభిషేకం జరిగింది. 1558వ సంవత్సరం నుంచి మరణించే వరకు మహారాణిగా ఉన్నారు. ఆమెను గ్లోరియాన, ఒరియాన, గుడ్ క్వీన్ గా పిలిచేవారు. ఆనాటి ట్యూడర్ సామ్రాజ్యానికి ఆమె ఆఖరి రాణి.
ఇంగ్లాండ్ మహారాజు ఎనిమిదో హెన్రీ కి బిడ్డగా జన్మించటంతో ఆమె పుట్టుకతోనే ఆ దేశానికి యువరాణి అయింది. అయితే ఆమె తల్లి అన్నే బోలిన్ హెన్రీకి రెండో భార్య. ఎలిజబెత్ పుట్టిన రెండున్నర ఏండ్ల తర్వాత అన్నేను ఉరితీశారు. ఎలిజబెత్‌ను ఎలిజబెత్ చట్ట విరుద్ధమైన సంతానంగా ప్రకటించారు. హెన్రీ చనిపోయిన తర్వాత ఎడ్వర్డ్ V× ఎలిజబెత్‌కు వారసత్వం ఇవ్వకుండా తన భార్య లేడీ జెన్ గ్రేకు కిరీటాన్ని అందజేశాడు. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు జరిగిన తర్వాత 1558 లో ఎలిజబెత్ మహారాణిగా పట్టాభిషేకం జరిగింది. ప్రజలకు మంచి చేయాలన్న ఎన్నో పథకాలతో, ఆలోచనలతో ఎబిజబెత్ రాజ్యపాలన చేసింది. ఆమె పాలన చేసిన కాలాన్ని స్వర్ణయుగంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. ఆమె పరిపాలనలో నిర్మించిన ప్రొటెస్టంట్ చర్చినే నేడు ఇంగ్లాండు చర్చిగా పిలుస్తున్నారు.
విదేశీవ్యవహారాల్లో ఎంతో చాకచక్యంగా వ్యవహరించేవారిని ఎలిజబెత్‌కు మంచి పేరుంది. తన తండ్రి, అన్నల పాలన కన్నా ఎలిజబెత్ పాలనలో ప్రజలు సంతోషంగా జీవించేలా ఎంతో కీలకమైన మార్పులు తీసుకువచ్చారు. అందుకే ఆమె పాలన చేసిన 44 ఏండ్ల కాలాన్ని ఎలిజబెత్ శకంగా పిలుస్తారు.