Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లెమన్‌గ్రాస్ (నిమ్మగడ్డి) వల్ల ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికే కాదు పర్యావరణానికి కూడా చాలా మంచిది. లెమన్‌గ్రాస్ వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందామా!
జలుబు నివారణకు : లెమన్‌గ్రాస్ ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, జలుబును నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాంతో పాటు నిమ్మగడ్డిలో ఉండే విటమిన్ 'సి' వ్యాధి నిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ : లెమన్‌గ్రాస్‌లో ఉండే కంటెంట్ కొలెస్ట్రాల్‌ను గ్రహిస్తుంది. కొలెస్ట్రాల్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. అలాగే అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. క్రమం తప్పకుండా నిమ్మగడ్డిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మెదడు పని విధానం : మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో లెమన్‌గ్రాస్ బాగా పని చేస్తుంది. మెదడుకు ప్రశాంతతను అందించడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. దాంతో పాటు ఏకాగ్రతను పెంచుతుంది. దీన్ని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. దాంతో పాటు మతిమరుపును దూరం చేస్తుంది.
ఇన్ఫెక్షన్లు : లెమన్‌గ్రాస్ యూరినరీ, చర్మ సమస్యలకు, పంటి సమస్యలకు మంచి యాంటీ బయోటిక్‌గా పని చేస్తుంది. దాంతో పాటు కీళ్ల నొప్పులు, వాపులును తగ్గిస్తుంది.
అజీర్తి సమస్య : దీన్ని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. దాంతో పాటు జీర్ణక్రియ పని విధానాన్ని మెరుగుపరుస్తుంది.
దోమల నివారణకు : దోమలు నివారణకు, దుర్వాసనను దూరం చేయడంలో లెమన్‌గ్రాస్ కీలకపాత్ర పోషిస్తుంది. దోమలు ఎక్కువగా ఉన్నచోట నిమ్మగడ్డిని ఉంచితే చాలు దోమలు క్షణాల్లో మాయం అవుతాయి.