Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రెగెంట్గా ఉన్నప్పుడు అమ్మలు విటమిన్ డి పుష్కలంగా తీసుకొంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తిమంతంగా ఉంటాయట. పిల్లల మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, చిన్నవయసు నుంచే వారి పట్టులో బిగువు ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. తమ బిడ్డలు కండల వీరులు కావాలనుకునే అమ్మలు విటమిన్ డి ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకుంటే చాలు. మగపిల్లలు సిక్స్‌ప్యాక్ కోసం ఆరాటపడుతున్న ఆ సమయంలో పరిశోధకుల సూచనలు ఆసక్తిగా మారాయి. అతిగా కసరత్తులు చేయాల్సిన అవసరం లేకుండానే సిక్స్‌ప్యాక్ బాడీ కావాలంటే అమ్మలకు బలమైన ఆహారం ఇవ్వాలని నిపుణులు తేల్చిచెప్పారు.
కేవలం బాడీబిల్డింగ్ కే కాదు, కాబోయే అమ్మలు విటమిన్ డి ఎక్కువగా తీసుకొంటే పిల్లల్లో శారీరక సత్తా పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరించారు. చర్మానికి సూర్యకాంతి తగిలినప్పుడు శరీరంలో విటమిన్ డి జనిస్తుంది. చేపలను తినడం ద్వారా కూడా కాబోయే అమ్మలు విటమిన్ డి ని సమృద్ధిగా పొందవచ్చు.