Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్రాంతి, విరామం లేకుండా కొన్నిసార్లు పనిచేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే పక్కాగా దినచర్యని పాటించాలి.
* నిత్యం చేసే పనులే... ఓ క్రమపద్ధతిలో వాటిని పూర్తి చేయకపోవడమే అసలు సమస్యకు కారణం. ఏ రోజుకారోజు చేయాల్సిన పనుల జాబితాను మొదటే సిద్ధం చేసుకోగలిగితే గజిబిజి ఆలోచనలు తగ్గి వాటి ప్రాధాన్యతా క్రమం అర్థమవుతుంది. వీలైతే ఈ జాబితాను ఇంట్లో మీ కంటికి కనిపించే చోట అతికించండి.
* పూర్తి చేయాల్సిన పనుల్ని చిన్న కారణాలకే వాయిదా వేయడం, వాటన్నింటినీ చివరిలో ఒకేసారి పూర్తి చేయాలనుకోవడం సరికాదు. నిజానికి ఇలా మల్టీటాస్కింగ్ చేయడం వల్ల పనులు పూర్తవ్వడం సంగతేమో కానీ ఒత్తిడికి గురికావలసి వస్తుంది. అందుకే అత్యవసరమైతే తప్ప మల్టీటాస్కింగ్ జోలికి పోవద్దు.
* ఒత్తిడికి కారణాల్ని సులువుగానే గుర్తిస్తాం. కానీ వాటిని అధిగమించడానికి మాత్రం శ్రద్ధ చూపించం. అయితే ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే కుంగుబాటుకి గురయ్యే అవకాశం ఉంది. దీన్నుంచి బయటపడాలంటే ఏ పనులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఒకచోట రాసుకోండి. అలాంటివన్నీ మీరే పూర్తిచేయాలనుకోకుండా పనిని బట్టి కుటుంబ సభ్యులతోనో లేక సహోద్యోగులతోనో పంచుకోగలిగితే ఒత్తిడి తగ్గుతుంది.
* చివరగా మరో ముఖ్యమైన విషయం... మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోగలిగితే ప్రతికూల ఆలోచనలు రావు. ఒత్తిడీ తగ్గుతుంది.