Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజంతా వివిధ రకాల పనులతో, కాలుష్యం, ఎండతో చర్మం అలసిపోతుంది. తిరిగి దానికి కాస్త కొత్త కాంతి రావాలన్నా, నూతనోత్తేజం పొందాలన్నా కచ్చితంగా కొన్ని టిప్స్ పాటించాలి. దానివల్ల మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ రాకుండా ఉంటాయి.
ఉదయం బయటికి వెళ్లేముందు ముఖానికి ఏవేవో అప్లై చేస్తుంటారు. కొన్ని రకాల ఉద్యోగాలు చేసేవారు కచ్చితంగా మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. ముఖానికి అప్లై చేసినవన్నీ చర్మం రంధ్రాల్లోకి చేరి ఉంటాయి. వాటిని అలాగే వదిలేస్తే చర్మానికి కీడు చేస్తాయి. కాబట్టి పడుకునేముందు ముఖం శుభ్రంగా కడుగుకోవాలి. మేకప్లాంటివి పూర్తిగా తొలగించాలి. క్లెన్సర్స్‌గా కెమికల్స్‌కు బదులుగా కొబ్బరినూనెను ఉపయోగించండి. తరువాత ముఖాన్ని కడిగేయండి.
రోజంతా అలసిపోయిన చర్మం తిరిగి యథాస్థితిని పొందేది రాత్రి సమయంలో దొరికే విశ్రాంతితోనే. రాత్రిపూట ముఖానికి పూతగా వేయడం కోసం ఏదైనా మాస్క్ లేదా మంచి మాయిశ్చరైజర్ ఉపయోగించండి. ముఖాన్ని కడిగిన తరువాత దీనిని అప్లై చేయండి. ఇది ముఖానికి తేమనందించడంతోపాటు చర్మం కాంతివంతమయ్యేలా చేస్తుంది.
చాలామంది రాత్రి పడుకునేటప్పుడు జుట్టును వదిలేస్తుంటారు. కానీ ఇలా వదిలేయడం వల్ల జుట్టు మీ చర్మానికి హాని చేస్తుందంటున్నారు నిపుణులు. జుట్టులో ఉండే నూనెలు సహజంగానే దుమ్ము, ధూళిని సులభంగా ఆకర్షిస్తాయి. రాత్రి పూట జుట్టు వదిలేస్తే తిరిగి అవన్నీ మీ ముఖ చర్మంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి పడుకునేటప్పుడు జుట్టును ఒక రబ్బర్‌బ్యాండ్‌తో టై చేయండి.
చామోమిల్ (చామంతులు)తో చేసిన టీ పొడి మార్కెట్లో దొరుకుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మానికి మేలు చేయడంతోపాటు బాగా నిద్రపట్టేలా చేస్తుంది. కాబట్టి రాత్రి పడుకునేముందు చామోమిల్ టీ తాగండి. ఉదయం నిద్రలేచినప్పుడు కచ్చితంగా తాజాగా కనిపిస్తారు.
రాత్రి పూట నిద్రించే మెత్త కవర్లు చాలా ముఖ్యం. ఎందుకంటే రాత్రంతా ముఖం వాటిపైనే ఉంటుంది. మెత్తకు వాడే కవర్ల తత్వం చర్మంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మృదువుగా ఉండే బట్టతో చేసిన కవర్లనే వాడండి. అలాగే రెండు మూడు రోజులకోసారి కవర్లను మారుస్తూ ఉండండి. ఇది ముఖం తాజాగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ు