Authorization
Mon Jan 19, 2015 06:51 pm
* మాటిమాటికీ నల్లా వదిలి ఉంచొద్దు. ఏ అవసరానికైనా నీటిని బకెట్లోకి పట్టుకొని, చెంబుతోనో, మగ్తోనో వాడుకోవాలి.
* బ్రష్ చేసేటప్పుడు కుళాయి వదిలేసి ఆడుతుంటాం కదా! కానీ ఒక నిమిషం పాటు కుళాయిని తిప్పి వదిలే స్తే దాదాపుగా ఐదు లీటర్ల నీరు వృథా అవుతుంది. చూశారా, ఎంత నీటిని వృథా చేస్తున్నామో!
* స్నానం చేసేటప్పుడు నీటిని అనవసరంగా పారబోసేస్తాం కదా! అట్లా చెయొద్దు.
* వాష్బేసిన్లలో నీళ్లు నెమ్మదిగా, తక్కువ పరిమాణంలో వచ్చేలా పంపుల్ని తిప్పాలి.
* బండ్లను పైపులతో కాకుండా బకెట్లోకి నీటిని పట్టుకొని మగ్లతో కడుక్కుంటే నీరు ఆదా అవుతుంది.
* వాహనాలు కడిగిన నీరు మొక్కలకు వెళ్లేలా చూసుకోవాలి.