Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంటిక్ ఫర్నీచర్ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఖరీదైన ఈ ఫర్నీచర్‌ను సొంతం చేసుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అలా కాకుండా మీ పాత ఫర్నీచర్‌కు యాంటిక్ స్టైల్ లోకి మర్చుకోవచ్చు.
కుర్చీలకు అలాగే టేబుల్స్ కు ట్రెడిషనల్ లుక్ ను అందించాలంటే కాస్తంత బ్రౌన్ షేడ్స్ ను అప్లై చేయండి. ఇలా కలర్స్ ని అప్లై చేయడం వలన వాతావరణ మార్పుల ప్రభావం ఫర్నీచర్ పై పడదు.
్ల మీ ఇంటి కర్టెన్స్ డార్క్ కలర్ లో ఉంటే, పాత ఫర్నీచర్ ను వైట్ కలర్ తో పెయింట్ చేయడం ద్వారా రూమ్ కి యాంటిక్ లుక్ ని అందించవచ్చు. క్లాసీ లుక్ తో పాటు కలర్స్ ని బాలన్స్ చేయడం ద్వారా ఎలిగెంట్ లుక్ సొంతమవుతుంది.
్ల ఇంట్లో ఏదైనా వేడుక జరుగుతుంటే పాత ఫర్నీచర్‌ను స్టైలిష్‌గా మార్చడానికి వాల్ పేపర్స్ ఉపయోగిస్తే చాలు. మంచి మంచి వాల్ పేపర్స్ ను ఎంచుకుని వాటితో ఫర్నీచర్ ను కవర్ చేయండి. ఇంటికి కొత్త అందం వస్తుంది.