Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డ్రెస్‌లకు జేబులెందుకుండాలి... బయటికి వెళ్లినప్పుడు అత్యవసరాలు దగ్గర పెట్టుకోవడానికి. కానీ ఒకప్పుడు అమ్మాయిల దుస్తులంటే లంగాజాకెట్లు, ఓణీలు, చీరలు. వాటికి జేబులుండే అవకాశమే లేదు. అందుకే చెక్కుడు సంచుల అవసరం వచ్చింది. పంజాబీ డ్రెస్‌లు, సల్వారు కమీజ్‌లు వచ్చిన తరువాత కూడా... కమీజ్‌లకు జేబులు రావడానికి చాలా కాలమే పట్టింది. వ్యక్తిగత ఆసక్తితో పెట్టించుకుంటే తప్ప... జేబులు ఉండే అవకాశమే లేదు. ఆ అవసరాన్ని గుర్తించిన బ్రాండెడ్ కంపెనీలు తమ సేల్స్ పెంచుకోవడానికి జేబులను ఆదరించాయి. బయటికి కనిపించకుండా చేతుల కిందుగా పక్కలకు మాత్రమే ఈ జేబులను డిజైన్ చేశారు! ఆ తర్వాత మరింత ముందడుగు పడి జేబులు ఇప్పుడు ఫ్రంట్‌కు చేరాయి. అలా ఫ్రంట్ జేబులున్న కుర్తీలే ఇవి. ఆ జేబుల డాబు చూడండి మరి!