Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలబంద రసం లేదా జెల్ ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీదున్న చిన్న చిన్న గాయాలు, మచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. జెల్ రాసుకున్న గంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
- అందరి ఇళ్లలో ఎప్పుడూ సిద్ధంగా ఉండే క్రీమ్ వాజిలిన్. రాత్రి పడుకోబోయే ముందు కాళ్లు, చేతులకు రాసుకోవాలి. మునివేళ్లతో మెల్లగా మసాజ్ చేసుకుని.. చేతులకు కాటన్బట్టతో తయారైన గ్లౌజులు, కాళ్లకు ఉతికిన సాక్సులు వేసుకుంటే తడి ఆరిపోదు. పొద్దున్నే చర్మం నిగనిగలాడుతుంది. చర్మం సున్నితంగా తయారవుతుంది.
- శరీరంలోని అన్ని భాగాల గురించి మనం పట్టించుకుంటాం కాని కనురెప్పల గురించి పెద్దగా పట్టించుకోము. అందుకనే రాత్రి పడుకునే ముందు.. కనురెప్పలకు ఒక చెంచా ఆముదం పట్టించుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా, బలంగా తయారవుతాయి.
- మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. దానివల్ల శరీరం మొత్తం హైడ్రేట్ అవుతుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు మంచి నీళ్లను తప్పక తాగాలి. ఆ చిన్న అలవాటే శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా చూస్తుంది.
- ఆల్మండ్ ఆయిల్లో కాస్త నిమ్మరసం కలుపుకుని.. ముఖానికి, కళ్లకింది భాగంలో రాసుకుంటే మంచిది. దీనివల్ల ఉదయాన్నే ముఖం చాలా తాజాగా కనిపిస్తుంది. కండ్లు నీరసంగా కనిపించవు.