Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనలో చాలామందికి పెంపుడు జంతువులను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా కుక్కపిల్లలను ఎక్కువ మంది పెంచుకోవడం మన చుట్టుప్రక్కల ఇండ్లల్లో చూస్తుంటాం. అయితే వాటి పెంపకంపై సరైన అవగాహన లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తి.. సమస్యగా మారుతుంది. అలా కాకుండా పెంపుడు జంతువుల పెంపకం ఆహ్లాదాన్ని ఇవ్వాలంటే వాటికి ఇవ్వాల్సిన ఆహారం గురించి.. వాటి అలవాట్ల గురించి ముందుగా అవగాహన పెంచుకోవాలి. వాటి శరీర తత్వాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, వాటికి ఫీడ్ చేయడం చాలా అవసరం. ముఖ్యంగా వాటిని అంధించే ఆహారం ఆరోగ్యకరమైనవి ఉండాలి. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాలు పెట్స్ ను తీవ్ర అనారోగ్యం బారిన పడేలా చేస్తాయి. కొన్నిసార్లు వాటికి ప్రాణాపాయస్థితికి తీసుకొస్తాయి.
మనం ఏదైనా తింటున్నప్పుడు మన పెంపుడు జంతువులకు కూడా పెట్టడం అలవాటు చేస్తాం. అయితే మనం తినే ఆహారాలైనా, మన పెంపుడు కుక్కలకు ఆరోగ్యానికి మేలు చేస్తాయా లేదా హాని చేస్తాయా తెలుసుకోవడం చాలా అవసరం.
కెఫిన్: కెఫిన్, కేఫినేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం మనకు అలవాటు. కొంత మేరకు ఇవి మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి. అయితే పెంపుడు కుక్కలకు కెఫిన్ ఎంత మాత్రం మంచిది కాదు. కెఫిన్ తీసుకోవడం వల్ల హార్ట్ బీట్ పెరగడం, ట్రీమర్స్, రెస్ట్ లెస్నెస్ గా భావించడం జరుగుతుంది. అందుకే పెంపుడు జంతువులకు కెఫిన్, టీ, ఇతర ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వకూడదు.
చాక్లెట్స్: చాక్లెట్స్ కుక్కలకు టాక్సిక్ ఫుడ్. ముఖ్యంగా పిల్లులకు డార్క్ చాక్లెట్ పాల కంటే హానికరం. చాక్లెట్స్లో కోకలెవల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల వాటిలో వాంతులు, డయోరియాకు కారణం అవుతుంది. ముఖ్యంగా అబ్ నార్మల్ హార్ట్ బీట్, కిడ్నీ ఫెయిల్యూర్, మరింత ప్రమాదకరంగా మారి ప్రాణహాని కూడా జరగవచ్చు.
ఆల్కహాల్: ఆల్కహాల్ అది ఎంత తక్కువైనా సరే...పెట్స్ కు చాలా ప్రమాధకరం. పెట్స్ ఆల్కహాల్ త్రాగడం వల్ల వాంతులు, డయోరియా, తుమ్ములు, ఇతర సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి. కాబట్టి, ఆల్కహాల్ ఎట్టిపరిస్థితిల్లో వాటికి దరిచేరనివ్వవద్దు.
నట్స్: మనుష్యులకు నట్స్ అత్యంత పౌష్టికాహారం, అయితే పెట్స్ విషయంలో ఇది చాలా వరెస్ట్ ఫుడ్ . పెట్స్ నట్స్ ను తిన్నాయంటే వాటికి వాంతులు అవుతాయి. శరీరం యొక్క ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోతుంది. పెట్స్ కు ఎండుద్రాక్షను అందివ్వడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది . పెట్స్ కు ఇది ఒక డేంజరెస్ ఫుడ్.
ఉల్లి, వెల్లుల్లి:పెంపుడు జంతువులు ఉల్లి, వెల్లుల్లి తినడం వల్ల వాటి శరీరంలోని రెడ్బ్లడ్సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఎనిమిక్గా మారిపోయి ప్రాణాలు కోల్పోతాయి. పెట్స్ కు ఉల్లి, వెల్లుల్లి దూరంగా ఉంచాలి.