Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్షణాల్లో అందుబాటులోకి వచ్చే ఫాస్ట్‌ఫుడ్ వైపు నేటి యువత మొగ్గు చూపుతున్నారు. నిమిషాల్లో కోరుకున్న ఆహారం అందించడానికి వీలుగా ఎన్నో ఆప్స్ అందుబాటులోకి వచ్చాయి. వంట చేసుకోవడానికి కూడా టైం లేని బిజీబిజీ లైఫ్‌లో ఆకలితీరడానికి ఎంతోమంది ఫాస్ట్‌ఫుడ్, బయటి ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఒక విధంగా చూస్తే.. ఇది బిజీగా ఉండేవారికి ఇది మంచిదే.. కానీ ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన భవిష్యత్‌లో కలిగే దుష్ప్రభావాల గురించి ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్స్ ని తీసుకోవడం వలన అతి పెద్ద అనారోగ్య సమస్యలకు మహిళలు గురవుతారని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తీసుకునే యువతలో సంతానోత్పత్తి సమస్యలు ఎక్కువగా
ఉత్పన్నమవుతాయట. ఫాస్ట్ ఫుడ్ ని తరచూ తీసుకునే వారిలో ఇన్ఫెర్టిలిటీ సమస్య తలెత్తుతుందని ఆస్ట్రేలియన్ స్టడీ స్పష్టం చేస్తోంది. ఈ స్టడీలో ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలోకి హానీకర కెమికల్స్ తో పాటు సోప్స్ తో పాటు మేకప్ సామగ్రిలో అలాగే ఆటోమొబైల్ ఇంటీరియర్ లో లభించే ఫ్తాలెట్స్ వంటి రసాయనాలు ప్రవేశిస్తాయని స్పష్టమైంది. దీని ద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం మహిళల్లో ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు మగవారిలో ప్రోస్టేట్ , మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్స్ రావడానికి కారణం అవుతుందని అధ్యయనంలో స్పష్టమైంది. ముఖ్యంగా నెలసరి సైకిల్ ను ఫాస్ట్‌ఫుడ్ డిస్టర్బ్ చేస్తుందని తద్వారా సంతానోత్పత్తిపై దుష్ప్రభావం కలుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఫెర్టిలిటీ రేట్స్ లోని గణనీయమైన తగ్గుదలను డెవెలప్డ్ కంట్రీస్ లో గమనించడం జరిగింది. దీనిపై పరిశోధనలు చేయడానికి ప్రెగెన్సీ ప్రారంభ దశకి చెందిన మెటర్నల్ బ్లడ్ శాంపిల్స్ ను తీసుకుని పరిశోధనలు చేస్తే.. వారిలో ఫాస్ట్‌ఫుడ్ కారణంగా శరీరంలో హార్మోన్లలో సమతుల్యత లోపించిందని స్పష్టమైంది. జంక్ ఫుడ్ వలన అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ఫెర్టిలిటీపై దుష్ప్రభావం చూపుతుందన్న ఫాస్ట్‌ఫుడ్ కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు కావాలనుకునే వారు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్ తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. ు