Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజమే.. మీరు బరువు తగ్గాలనుకుంటే బాగా నవ్వాలంటూన్నారు నిపుణులు. మన పెద్దవాళ్లు నవ్వు నాలుగువిధాల చేటు అంటూ ఎక్కువగా నవ్వనిచ్చేవారు కాదు. ఇప్పుడు అదేనవ్వు నాలుగు విధాల మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ పది నుంచి 20 నిమిషాల పాటు పెద్దగా నవ్వడం వలన 20కాలరీలు కరుగుతాయని వారు చెబుతున్నారు. అనేక మందిపై పరిశోధనలు చేసిన అనంతరం బరువు తగ్గించడంలో నవ్వు బాగా పనిచేస్తుందని తేల్చిచెప్పారు. నవ్వు తెప్పించే సినిమాలు, టీవీ కార్యక్రమాలు, కామిక్స్ చదవడం కాలరీలను కరిగిస్తాయట. రోజూ కొద్దిసేపు మనస్ఫూర్తిగా నవ్వడం వలన రక్తపోటు, ఒత్తిడి, ఆందోళన వంటివి దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. అందేకాదు ప్రతిరోజూ ఎంతోకొంత సేపు నవ్వేవారికి ప్రాణాంతక వ్యాధులేవీ దరిచేరవట! మరి ఎందుకు ఆలస్యం.. మనసారా నవ్వండి.. మీ చుట్టూ ఉన్నవారిని నవ్వించండి. లాఫింగ్ క్లబ్‌ల్లో చేరిపోయి.. హెల్త్‌ను కాపాడుకోండి.