Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందంగా కనిపించాలంటే కేవలం దుస్తులు, జ్యువెలరీ మాత్రమే బాగుంటే సరిపోదు. వాటిమీదకు నప్పే చెప్పులు ఉంటేనే మరింత అందంగా కనిపిస్తారు. చాలామందికి చెప్పుల ఎంపిక తెలిదు. అలాంటి వారు కింది విధంగా చెప్పులను ఎంచుకుంటే సరిపోతుంది.
- గౌనులు వేసుకున్నప్పుడు హై హీల్స్‌ను ఎంచు కుంటే మంచిది. ఎందుకంటే ఈ చెప్పులు మిగిలిన అన్ని రకాల కంటే బాగా ఎత్తుగా ఉంటాయి. వేసుకున్నప్పుడు దుస్తులకు అడ్డుపడితే.. నడవడం కష్టంగా ఉంటుంది.
- సాధారణ చెప్పులు, షూ, ఫార్మల్ దుస్తులతో హుందాతనం ఉట్టిపడేలా కనిపించాలనే ఉద్యోగినులు వీటిని వేసుకోవచ్చు.
- మిడ్డీలూ, మినీలూ, అనార్కలీలు... ఇలా అన్ని రకాల దుస్తుల శైలికీ చక్కగా నప్పేరకం 'వెడ్జెస్'. ఎత్తుగా కనిపించాలనుకునేవారే కాదు..సొగసుగా ఉండాలి అనుకునే వారు వీటిని వేసుకోవచ్చు.
- జీన్స్, క్రాప్ టాప్స్... స్కర్ట్‌లూ ఇలా పాశ్చాత్య శైలిలో ప్రత్యేకంగా మెరిసిపోవాలనుకునే ముద్దు గుమ్మలకు 'కిటెన్ హీల్స్' ప్రత్యేకం. వీటిల్లో పాయింట్ హీల్‌తో పాటు వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి.
- భారతీయ సంప్రదాయ దుస్తులకు అనువైనవి ప్లిఫ్ ప్లాప్స్. ఇవి రోజు వేసుకోవడానికి కూడా బాగుంటాయి.