Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధుమేహుల్లో మూత్రం ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. రక్తంలో పెరిగిన గ్లూకోజ్‌ను మూత్ర పిండాలు వడకట్టడమే ఇందుకు కారణం. ఇలా గ్లూకోజ్‌ను మూత్రపిండాలు ఫిల్టర్ చేయటానికి నీరు ఎక్కువగా అవసరమవుతుంది. ఫలితంగా శరీరంలోని నీరు కూడా గ్లూకోజ్‌తోపాటు ఫిల్టరై మూత్రం రూపంలో బయటకు వస్తుంటుంది. ఇలా ఎక్కువగా మూత్ర విసర్జన చేసే లక్షణాన్ని 'పాలీ యూరియా' అంటారు. ఈ లక్షణాన్ని బట్టి మధుమేహం ఉందని తేలికగా కనిపెట్టేయవచ్చు. వీరిలో యూరిన్ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువే! ఇన్ఫెక్షన్లు పదే పదే రావటం వల్ల మూత్రాశయం ఇరిటేట్ అయిపోతుంది. ఫలితంగా కొద్ది మూత్రం నిండుకోగానే మూత్రాశయం దాన్ని బయటకు తోసేయటానికి ప్రయత్నం చేస్తుంది. దాంతో ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. డయాబెటిక్ ఇన్స్పిడస్ రోగుల్లో కూడా పాలీ యూరియా లక్షణాలు కనిపిస్తాయి. వీళ్ల శరీరంలో నీటి విసర్జనను నియంత్రించే 'యాంటీ డయూరిటిక్ హార్మోన్' తగ్గటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.