Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరైనా బాధాకరంగా ఉంటే ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. నిరాశ నిస్పృహల మధ్య రోజులు గడుపుతూ జీవితంపై నిరాసక్తతగా ఉంటారు. చేసే పనుల్లో ఆసక్తి లేకపోవడం, ఒంటరిగా గడపాలని అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే వారు డిప్రెషన్లో ఉన్నారని గుర్తించాలి. డిప్రెషన్లో ఉన్న వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపితే చాలు వాళ్లు మళ్లీ మామూలు వ్యక్తులుగా మారతారని నిపుణులు చెబుతున్నారు.
డిప్రెషన్ పురుషుల్లో కంటే స్త్రీలే ఎక్కువగా ఉంటారని తాజా అధ్యయనాల ద్వారా తెలిసింది. ఎప్పుడూ మన సు నిండా బాధతో ఉండటం, ఆందోళన చెందటం డిప్రెషన్ లక్షణాలు. కోపం, బాధ, చిరాకుతోపాటు జీవితం అగమ్యగోచరంగా తోస్తుంది. ఆకలి లేకపోవటం, లేదంటే విపరీతంగా ఆకలి వేయడం, ఏకాగ్రత లోపించడం, మతిమరుపు, సెక్స్ ఆలోచ నలు తగ్గడం, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, నిద్ర లేకపోవడం లాంటివి డిప్రెషన్ లక్షణాలు. దీర్ఘకాలం గా ఆందోళన, గాబరాగా ఉండే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశముంది. గుండె సమస్యలు, క్యాన్సర్, మధుమేహం జబ్బులతో డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. పౌష్టికాహార లోపం వల్ల కూడా డిప్రెషన్లోకి పోయే ప్రమాదం ఉంది.
డిప్రెషన్లో కొన్ని రకాలు
- మేజర్ డిప్రెషన్లో లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవటం, నిద్ర లేక పోవటం, పనిలో శ్రద్ధ లేకపోవటం వంటివి.
- డిస్థిమిక్ డిజార్డర్ లో దీర్ఘకాలికంగా తక్కువ స్థాయిలో డిప్రెషన్ లక్షణాలు వ్యక్తిలో ఉంటూనే ఉంటాయి. ఈ లక్షణాలు కొన్నిసార్లు కనబడకుండా రోగి సాధారణంగా ఉన్నట్లు అనిపిస్తుంది. తిరిగి డిప్రెషన్ లక్షణాలు ఉత్పన్నం అవుతాయి.
- డిప్రెషన్ లక్షణాలతో పాటు ఇల్యూజన్ ఉన్నట్లయితే సైకోటిక్ డిప్రెషన్ అంటారు.
- ఆడవారిలో ప్రసవం తర్వాత హార్మోన్ల అసమతుల్యత వల్ల కొంతమందిలో డిప్రెషన్ లక్షణాలు కనబడతాయి. దాన్ని పోస్ట్నేటల్ డిప్రెషన్ అంటారు.
- సూర్యరశ్మి తగ్గడం వల్ల డిప్రెషన్ లక్షణాలు వస్తాయి. డిప్రెషన్లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తన కనబరుస్తారు. వీరిలో కోపం, ఉద్రేకం తారాస్థాయికి చేరడం, తర్వాత సాధారణ దశకు రావటం జరుగుతుంది.
- ఎవరైనా సమస్యతో కుంగిపోయినపుడు వారికి తగినంత మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి. సానుకూల దృక్పధాన్ని అలవాటు చేయాలి. మనసు, ఆలోచనలు అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం చేయాలి. మెదడులోని రసాయనాల అసమతుల్యత రాకుండా ఉండటానికి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలి. జింక్, బి 12, విటమిన్ ' సి' ఉండే ఆహార పదార్థాలు ఇవ్వాలి. ఒక బాధాకరమైన సంఘటన జరిగినపుడు వాటి ఆలోచనల్లో నుంచి బయట పడటానికి ఇతర పనుల్లో నిమగం కావాలి. ఇష్టమైన వ్యాపకాలతో మనసును కేంద్రీకరించాలి.