Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిద్ర.. శరీరానికి చాలా అవసరం. నిద్ర సరిగా పోనివారిలో ఈ మతిమరపు లక్షణాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. కాబట్టి వేళకు సరిపడా గంటలు నిద్రపోవడం మంచిది. నిద్ర మీ ఆకలిని, ఎక్కువ కెలొరీలు ఉండే పదార్థాలను తినాలనే కోరికను కలిగించే హార్మోన్లను అదుపులో ఉంచుతుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలంటే వేళకు నిద్రపోవడం మంచిది. నిద్ర నొప్పి నివారిణిలా కూడా పనిచేస్తుంది. గాయాలైనప్పుడు ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. నిర్ణీత వేళ్లలో క్రమంతప్పకుండా హాయిగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉండాలన్నా వేళకు నిద్ర ముఖ్యమే! మరి ఇన్ని లాభాలున్న నిద్రను చాలా మంది దూరం చేసుకుంటున్నారు. దానికి ఒత్తిడి ఒక్కటే కారణం కాదు... అనేక అలవాట్లు కూడా భాగమవుతున్నాయని చెబు తున్నారు.
ఏ కాస్త ఒత్తిడిగా ఉన్నా కప్పు కాఫీ తాగాల్సిందే. కనీసం రోజులో ఐదారుసార్లైనా సరే తాగుతుంటారు కొందరు. అయితే అది ఆ సమయంలో ఒత్తిడిని తగ్గించినప్పటికీ దానిలో ఉండే కెఫీన్ నిద్రను ప్రభావితం చేస్తుందట, అందుకే వీలైనంతవరకూ రాత్రిపూట టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది. అధికరక్తపోటును అదుపులో ఉంచేందుకూ, ఒత్తిడిని నివారించేందుకు వాడే యాంటీడిప్రెసెంట్లు కూడా నిద్రలేమికి కొన్నిసార్లు కారణం అవుతాయి. ఒకవేళ ఆ కారణాలకు మందులు వైద్యులు సూచిస్తోంటే గనుక నిద్రలేమి సమస్య ఎదురవుతుందా లేదా అనేది వైద్యులతో ముందే మాట్లాడి తీసుకోవడం మంచిది.
నిద్రలేమికి ఒత్తిడికి ప్రధాన కారణం అంటారు నిపుణులు. పనులూ, ఇతర కారణాల వల్ల అనవసర ఒత్తిళ్లకు లోనయ్యేవారు దాన్నుంచి బయటపడేలా చూసుకోవాలి. వ్యాయామం, ధ్యానం వంటివి చేయాలి. అలాగే ఒత్తిడికి గల కారణాలను తెలుసుకుని అధిగమించేలా చూసుకోవాలి. సెల్ఫోన్: ఇప్పుడు ఎంత నిద్రవచ్చినా సరే! సెల్ఫోనుతో ఎక్కువ సేపు గడుపుతుంటాం. దాని నుంచి వచ్చే వెలుతురు నిద్రకు భంగం కలిగిస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో ఫోన్కు దూరంగా ఉండండి. ు