Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొడిచర్మం అసౌకర్యంగా ఉంటుంది. చర్మం పొడిబారటానికి కారణాలు ఏవైనా అదనపు సంరక్షణతో, శ్రద్ధతో బాగుచేసుకోవాలి. పొడి చర్మాన్ని బాగుచేసుకోటానికి చాలా సహజ చిట్కాలున్నాయి. మొదటిది కొబ్బరినూనె. ఇది పొడిచర్మాన్ని చాలా ప్రభావవంతంగా నయం చేస్తుంది. కొబ్బరినూనె చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, చర్మంపై లిపిడ్స్‌ను ఎక్కువ చేస్తుంది. నూనెలో ఉండే సాచ్యురేటడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఎమోలియంట్ లక్షణాలు పొడి చర్మానికి గొప్ప మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. కొబ్బరి నూనెలాంటి సురక్షితమైన మరో చిట్కా దోసకాయ. వివిధ కాస్మెటిక్ ఫార్ములేషన్లలో కూడా దోసకాయను వాడతారు. ఇది లోతుగా హైడ్రేట్ చేసి, పొడి చర్మానికి మేటి చికిత్సగా పనిచేస్తుంది.కొబ్బరినూనె, దోసకాయ కాంబినేషన్లో ఫేస్ ప్యాక్ కన్నా పొడిచర్మానికి మంచి చిట్కా!
దోసకాయను తురమండి. కొబ్బరినూనెను దీనికి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడకి పట్టించండి. 15నిమిషాలు అలా వదిలేసి, నీళ్లతో కడుక్కోండి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండుసార్లు వాడండి. కొబ్బరినూనె గొప్ప మాయిశ్చరైజర్ గా తిరుగులేనిది. దోసకాయ మెరుగైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. దోసకాయ గొప్ప యాంటీఆక్సిడెంట్‌గా, వాపు వ్యతిరేక లక్షణాలతో, హైడ్రేట్ చేస్తూ, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఉబ్బిన చర్మాన్ని మామూలు చేసి రంగును తేటపరుస్తుంది. ఈ రెండు కలిసిన కాంబినేషన్ పొడి చర్మానికి అద్భుతమైన చికిత్స. పొడి చర్మాన్ని హైడ్రేట్ చేయటమే కాక, మొటిమల మచ్చలు, ఎండవల్ల కమిలిపోయిన చర్మాన్ని తొలగిస్తాయి కూడా!
్ల కొబ్బరినూనె మిగతా నూనెలకన్నా చర్మంలో లోతుగా ఇంకి, మీ చర్మాన్ని పొట్టుగా ఊడిపోవటంకి దూరం చేసి, పాపాయిలంత మ దువైన చర్మంగా మారుస్తుంది. ఎక్కువకాలం చర్మాన్ని తేమగా కూడా ఉంచుతుంది. మొటిమలను తగ్గించి, వాటివలన వచ్చే వాపులకు ఉపశమనం అందిస్తుంది.
్ల దోసకాయలోని విటమిన్ సి, కెఫీస్ యాసిడ్ చర్మంపై మంటను, వాపును తగ్గిస్తుంది. మచ్చలు, చారలు, కంటి చుట్టూ నల్లవలయాలు, చర్మంపై నల్లమచ్చలు తొలగించి, చర్మం రంగును తేటపరుస్తుంది. -దోసకాయ ఎండ వల్ల ట్యాన్ ను, చర్మంపై వయస్సు మీరే లక్షణాలు, ముడతలను నివారిస్తుంది. చర్మరంథ్రాలను గట్టిపరిచి, మ దువుగా ఉంచుతుంది. కొబ్బరినూనె, దోసకాయ ఫేస్ ప్యాక్ మీ పొడిచర్మం తొలగించి, చర్మానికి కొత్త జీవం పోస్తుంది.