Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హై హీల్స్... ప్రస్తుతం అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే ఫ్యాషన్ ట్రెండ్. నలుగురిలో ప్రత్యేకంగా, స్టయిల్‌గా కనిపించడం కోసం ఎత్తు మడమల చెప్పులు వాడొచ్చు. అయితే వాటి వాడకం మితంగా ఉండాలి. లేదంటే రకరకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే.
పెన్సిల్ హీల్, వెడ్జెస్, బ్లంట్ హీల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల హై హీల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. దుస్తులకు తగ్గట్టు రకరకాల ఎత్తు చెప్పులను యువతులు ఎంచుకుంటూ ఉంటారు. అయితే వాటిని వేసుకుని కొద్ది దూరం నడిస్తే చాలు కాలి వేళ్లు, పాదాలు, పిక్కల నొప్పులు మొదలుపెడతాయి. దాంతో ఎత్తు మడమల చెప్పులతో కాళ్లు మాత్రమే నొప్పులు పెడతాయి అనుకుంటాం. కానీ నిజానికి హై హీల్స్ వాడకం వల్ల పూర్తి శరీరాకృతి, ఎముకలు, కండరాలు, పునరుత్పత్తి వ్యవస్థ, నెలసరి.. ఇలా బాహ్య, అంతర్గత అవయవాలన్నీ ఎంతో కొంత దెబ్బ తింటాయి.
అందుకే హై హీల్స్ వాడే విషయంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధ్యమైనంత వరకు వీటిని వాడకుండా ఉంటే మంచింది. ు