Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీనేజ్ అమ్మాయిలు అంటేనే నవ్వులు చిందిస్తూ, తుళ్లుతూ అందరినీ ఆటపట్టిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో టీనేజర్లు ఏన్నో టెన్షన్లతో బాధపడుతున్నారు. ఈ యంగ్ ఏజ్‌లో అమ్మాయిలు తీవ్ర ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుతున్నారంటే అందుకు ముఖ్యకారణం వాళ్లు ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించడమేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
- ఈ కాలం టీనేజర్లు ఆనందం, ఉత్సాహం, బాధ ఏది కలిగినా దాన్ని పట్టలేరని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేనప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. జీవితం మంచీ చెడూ, ఆనందం, విషాదం వంటి వాటిని అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
- సమస్య చిన్నది కావచ్చు లేదా పెద్దది కావచ్చు మీకు మీరే తీవ్రంగా ఆలోచించి భయపడటం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఆందోళనతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అలా కాకుండా ఆ విషయాన్ని అమ్మకో, స్నేహితురాలికో చెప్పి చూడండి. కచ్చితంగా మీకు ఓ మంచి మార్గం దొరుకుతుంది.
- కొన్ని సందర్భాలలో తెలియని ఆందోళన, ఒత్తిడి ఏర్పడుతుంది. అటువంటి సమయాల్లో మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనిపిస్తుంది. అయితే అది సహజమేనని గుర్తించాలి. అవతలి వారు మీ మాటను పట్టించుకోవడం లేదనుకోవడం కంటే, మీరు ఆ విషయాన్ని వాళ్లకి అర్థమయ్యేలా చెప్పాలి. మీ మాటల్ని ఎవరూ సమర్థించకపోవడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని సానుకూల దృక్పథంతో ఆలోచించాలి.
- యంగ్ ఏజ్ అమ్మాయిల్లో ఒత్తిడికి ప్రధాన కారణం ఆత్మన్యూనతే ప్రధాన కారణం. ఏ విషయంలోనైనా పోటీతత్వం ఉండాలి. కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలన్న ప్రాథమిక నియమాన్ని మరిచిపోవద్దు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే అవతలి వారు విజయాలను చూసినప్పుడు వారి నుంచి ఏం నేర్చుకోవాలని ఆలోచించాలి. అది మంచి విషయమైతే మాత్రమే.