Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తీసుకున్న ఆహారం వల్ల మాత్రమే నోటి దుర్వాసన వస్తుందనుకుంటే పొరబాటు. శరీరంలో నీటి శాతం తగ్గిందనడానికి ఇది ఓ సూచన. నీటి నిల్వలు తగ్గినప్పుడు శరీరంలో సలైవా ఉత్పత్తి తగ్గి బ్యాక్టీరియా శాతం పెరిగి ఈ సమస్య ఎదురవుతుంది.
తలనొప్పి: తరచూ తలనొప్పి వేధిస్తుంటే ఏవో కారణాలు ఊహించుకుంటారు. కానీ నీళ్లు సరిగా తాగకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని గుర్తించరు. శరీరంలో నీటి శాతం తగ్గింది అనడానికి కూడా తలనొప్పి ఓ సూచనే. ఈ సారి తలనొప్పి వస్తే ఓ రెండు గ్లాసుల మంచి నీళ్లు తాగి చూడండి. ఫలితం కనిపించొచ్చు.
అలసట: కాసేపు పనిచేస్తే చాలు ఆయాసం, నీరసంగా అనిపిస్తుందా? అయితే మీ శరరీంలో నీటినిల్వలు తగ్గాయేమో గమనించుకోండి. డీహైడ్రేషన్ వల్ల శరీరం ఇట్టే అలసిపోతుంది. మానసికంగానూ బలహీనమవుతారు. అందుకే రోజు మొదలవుతుండగానే రెండుగ్లాసుల నీళ్లు తాగండి. ఇవి మీ శరీర జీవక్రియలన్నీ సక్రమంగా పనిచేసేలా సహకరిస్తాయి.
నొప్పులు: ఒక్కోసారి ఒళ్లంతా నొప్పులు, కండరాలు పట్టేసినట్లూ ఉంటాయి. దానికి కారణం జ్వరమో మరొకటో కాకపోవచ్చు. నీళ్లు సరిగా తాగనప్పుడూ ఈ సమస్య కనిపించొచ్చు. అందుకే రోజులో కనీసం పదిగ్లాసుల నీళ్లైనా తాగేలా చూసుకోండి.