Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగీతం శిశువు మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అవును మీరు చదివింది నిజమే. లయబద్దమైన సంగీతం.. సంభాషణల శబ్దాలు పసి పాపాయిల మెదడుపై చక్కగా పని చేస్తాయనీ, వారు వేగంగా.. చురుగ్గా స్పందించేలా పని చేస్తాయని చెబుతుంది ఓ తాజా అధ్యయనం. వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ మేరకు అధ్యయనాన్ని నిర్వహించారు. ఒక్కమాటలో చెప్పాలంటే సంగీతం, మాటల సవ్వడులు శిశువు మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపినట్టు పరిశోధకులు విశ్లేషించారు. ఇందుకోసం ఎంపిక చేసుకున్న 39 మంది శిశువులను బృందాలుగా విడదీసి పరిశోధకులు సుమారు నెల రోజుల పాటు వరుసగా ప్రయోగాత్మక అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో ఓ బృందానికి చెందిన శిశువులకు మాత్రం సంగీతం కాకుండా ఆటబొమ్మలను అందచేసి ఆడుకుంటున్న సమయంలో వారి మెదడు స్పందించిన తీరునూ అంచనా వేశారు. ప్రయోగాత్మక పరిశీలనా క్రమంలో తలిదండ్రులు తమ శిశువులు సంపూర్ణంగా సహకరించేలా తోడ్పాటునందించారు. ఈ ప్రయోగాత్మక కార్యక్రమంలో పిల్లల్లో కాగెటివ్ స్కిల్స్ (అభిజ్ఞ నైపుణ్యాలు) దశలవారీగా వృద్ధి చెందిన వైనం స్పష్టమైంది. సంగీతం, భాషల్లో ఓ శక్తివంతమైన లయ విన్యాసం ఉంటుంది. పలికే పదాలు, ఇతరులు సులభంగా గ్రహించ గలుగుతారు. ఇది పాపాయిలో మాట్లాడే సామర్థ్యాన్ని పెంచుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. నియంత్రించగలిగే ఈ ప్రయోగంలో లయబద్ధ సంగీతానికి దూరంగా కార్లు, బైక్‌లతో ఆడుకున్న శిశువులకూ... సంగీతాన్ని విన్నవారికీ మెదడు స్పందనల్లో స్పష్టమైన తేడాను తాము గుర్తించగలిగినట్టు పరిశోధకులు వెల్లడించారు. ు