Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెదాలు పగిలిపోవడం, నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలు సాధారణంగా అందరిని వేధిస్తుంటాయి. దీనికి చక్కటి పరిష్కారం అందిస్తుంది పెట్రోలియం జెల్లీ. మరి పెట్రోలియం జెల్లీని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా!
- చేతి గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం వారంలో రెండు మూడుసార్లు కాస్త పెట్రోలియం జెల్లీని రాసుకుని మృదువుగా మర్దన చేయాలి.
- అలాగే పెట్రోలియం జెల్లీతో మేకప్‌ను కూడా తొలగించుకోవచ్చు. రసాయనాలతో కూడిన రిమూవర్లకు బదులుగా దీని సాయంతో మస్కారా, లిప్‌స్టిక్, ఐలైనర్లను సులభంగా తొలగించవచ్చు.
- తలకు రంగు వేసుకునేముందు దీన్ని నుదుటిపై భాగాన, మెడదగ్గరా కాస్త రాసుకోవాలి. దానివల్ల రంగు అంటకుండా ఉంటుంది.
- పెట్రోలియం జెల్లీకి కాస్త చక్కెర కలిపి ముఖానికి మృదువుగా రాసుకోవాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.
- పర్ఫ్యూమ్ కొట్టుకునే ముందు చేతి మణికట్టుపై దీన్ని రాసుకోవడం వల్ల ఆ పరిమళం ఎక్కువ సమయం ఉంటుంది.
- ఈ కాలంలో కాళ్లు ఎక్కువగా పగులుతుంటాయి. ఇలాంటి సమస్యలున్నవారు రాత్రిళ్లు పాదాలకు కాస్త పెట్రోలియం జెల్లీని రాసుకుని సాక్సులు వేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే పగుళ్లు పోయి పాదాలు మృదువుగా మారతాయి.
- మోచేతులు, మోకాళ్లూ పొడిబారి ఇబ్బంది పెడుతున్నాయా! ఈ సమస్య ఉన్నవారు ప్రతీరోజూ పెట్రోలియం జెల్లీని రాసుకుని మర్దన చేయాలి. ఇలా చేస్తే చర్మానికి తగిన తేమ అంది తాజాగా కనిపిస్తుంది.