Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటికి అందం మొక్కలు... మొక్కలు చూడటానికి చిన్నగా ఉన్నా ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. చల్లటి గాలిని వెదజల్లుతాయి. ఇల్లు చిన్నగా ఉందని.. మొక్కలు పెంచుకోవడానికి ఇబ్బందిగా ఉందని బాధపడేవారు చాలామంది ఉంటారు. కానీ అలా బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంట్లో వృథాగా పడుండే వాటర్ బాటిల్స్‌లో మీకిష్టమైన చిన్న చిన్న మొక్కలను నాటుకోవచ్చు. బాటిల్లో సగం వరకు మట్టిని నింపి గోడలకు వేలాడదీయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా గోడలు అందంగా, ఇల్లు విశాలంగా కనిపిస్తుంది. మరెందుకు ఆలస్యం.. ఈ వానాకాలంలో ఇలా ప్రయత్నించి చూడండి!