Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమలా పండ్లు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని తొక్కులతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
- ఒక్కోసారి ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలా ఫ్రిజ్ నుండి దుర్వాసన వచ్చినపుడు ఎండబెట్టిన కమలా తొక్కుల పొడిని రెండు చెంచాలు తీసుకుని అందులో కాస్త ఉప్పు వేసి ఓ పాత్రలో కలుపుకుని ఫ్రిజ్లో ఉంచాలి. ఇలా చేస్తే ఫ్రిజ్లో నుండి వచ్చే దుర్వాసనను, తేమనూ పీల్చుకుంటుంది. కమలా పొడి లేకపోతే తాజా కమలాపండును ఉంచితే కూడా మంచిదే.
- నిమ్మజాతి ఫలాల్లో లెమొనేన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది దోమల్ని, ఈగల్ని దూరం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ రసాయన పదార్థం కమలా ఫలంలో 90 శాతం మేరకు ఉంటుంది. అందువల్ల దోమలూ, ఈగల బెడద ఉన్నచోట ఈ కమలా తొక్కలను ఉంచుకుంటే మంచిది.
- రంధ్రాలున్న ఓ డబ్బాలో కొన్ని కమలా ఫలం తొక్కలు వేసి దుస్తుల అల్మారాలో ఉంచితే సువాసనలు వస్తాయి. స్వీట్ల తయారీలో ఉపయోగించే షుగర్ త్వరగా గడ్డ కట్టకుండా ఉండేందుకు ఈ కమలా తొక్క ఎంతగానో దోహదపడు తుంది. తేమను త్వరగా పీల్చే గుణం ఈ తొక్కల్లో అధికంగా ఉంటుంది.
- ఇకపోతే ఒక సీసాలో రెండు కమలాపండ్ల తొక్కలని వేసి అవి మునిగేంతవరకూ వెనిగర్ వేయాలి. ఆ సీసాను వారం పదిరోజులు అలానే వదిలేయాలి. తరువాత ఆ తొక్కలని తొలగించి మిగిలిన వెనిగర్ని స్ప్రే సీసాలో తీసుకుంటే చెక్క ఫర్నిచర్, ఫ్రిజ్, ఓవెన్, స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులు తుడవడానికి చాలా ఉపయోగపడుతుంది.