Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగు చినుకులు పడితే చాలు జుట్టు జిడ్డుగారుతూ కనిపిస్తుంది. అలాగే చివర్లు చిట్లడం, జుట్టురాలడం వంటి సమస్యలూ ఈ కాలంలో మామూలే. వీటిని అధిగమించాలంటే ఇంట్లోనే అప్పుడప్పుడూ ఈ పూతలు ప్రయత్నించి చూడండి.
- ఆలివ్‌నూనె, తేనెను 2:1 నిష్పత్తిలో తీసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి కాస్త గోరువెచ్చగా చేసి తరువాత మాడుకు కాకుండా మిగిలిన జుట్టుకు పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.
- చివర్లు చిట్లిన సమస్య చాలామందిలో కనిపిస్తుంది. దీన్ని నివారించాలంటే అరకప్పు పెరుగులో పావుకప్పు బొప్పాయి గుజ్జు కలిపి తలంతా పూతలా పట్టించాలి. అరగంటాగి గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. అదేవిధంగా కలబంద గుజ్జులో పెద్ద చెంచాడు నిమ్మరసం, రెండు పెద్ద చెంచాల ఆముదం కలిపి తలంతా రాసి బాగా మర్దనా చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చివర్లు చిట్లడటం తగ్గుతుంది.
తలస్నానం చేసినా జుట్టు జిడ్డుగా కనిపిస్తోందా. రెండు గుడ్ల పచ్చసొనలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి బాగా కలపాలి. దీన్ని తలకు రాయాలి. బాగా ఆరాక తలస్నానం చేయాలి. జిడ్డు వదలడమే కాదు, మెరుస్తుంది కూడా.