Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పు నీళ్లు నోటిని ఆరోగ్యంగా ఉంచే సహజసిద్ధ మౌత్వాష్. కప్పు గోరువెచ్చని నీళ్లలో పెద్ద చెంచా ఉప్పు కలపాలి. రోజుకు మూడుసార్లు ఉప్పు నీటితో నోటితో పుక్కిలిస్తే చిగుళ్లకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా భోజనం చేసిన తరువాత ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- కప్పు ఉప్పునీళ్లలో రెండు చెంచాల వెనిగర్ కలపాలి. ఈ నీటిని ఓ సీసాలోకి తీసుకోవాలి. దీన్ని ఫ్రిజ్లో ఉంచుకుంటే వారం పాటు నిల్వ ఉంటుంది. చిన్న మూతలో ఈ నీటిని తీసుకుని అవసరమైనప్పుడు పుక్కిలించి ఉమ్మేస్తే సరిపోతుంది. కుదిరితే యాపిల్సైడార్ వెనిగర్ వాడితే మంచిది.
- ఒక కప్పు చల్లటి నీళ్లలో పది చుక్కల లవంగం నూనె, లేదంటే చెంచా దాల్చిన చెక్క పొడి కలపాలి. ఇది మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. లవంగం, దాల్చినచెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలో ఉండే బ్యాక్టీరియాను చంపి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.