Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదివారం వచ్చిందంటే ఏంచేస్తారు? యువత అయితే సినిమాలకు, షికార్లకు. ఇక కుటుంబాలయితే... పిల్లలను బయటికి తీసుకెళ్తారు. కానీ అడుగు బయట పెడదామంటే బయటేమో ముసురు.. లేదు ఇంట్లోనే ఉందామంటే భరించలేని పిల్లల అల్లరి. వారి నోళ్లు మూతపడి.. చేతులకు పని చెప్పాలంటే... ఏదో ఒక కాలక్షేపం అవసరం. అలాంటివారి కోసమే ఈ ట్రిక్స్. ఇటీవలి కాలంలో పేపర్ప్లేట్స్ వాడకం పెరిగిపోయింది. రకరకాల సైజుల్లో ప్లేట్లు దొరుకుతున్నాయి. ఆ ప్లేట్లతోపాటు రంగులు, గమ్ ఉంటే చాలు. మంచి మంచి బొమ్మలు తయారు చేయించొచ్చు పిల్లలతో. ఇలా చేయడం వల్ల పిల్లలకు మీకు మధ్య బాండింగ్ పెరుగుతుంది. వారికి సృజనాత్మకత అలవడుతుంది. ఇంకెందుకాలస్యం ప్లేట్లకు పనిచెప్పండి!