Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ సైక్లింగ్ చేయడం వల్ల శరీరానికి ఎంతో మంచిది. శరీరం మంచి ఫిట్నెస్తో ఉంటుంది. అంతేకాదు దీని వల్ల పొందే ఆరోగ్య ఫలితాలు కూడా చాలా ఉన్నాయి.
సైక్లింగ్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఇండోర్ సైక్లింగ్. రెండవది అవుట్డోర్ సైక్లింగ్. చాలామంది అవుట్డోర్ సైక్లింగ్‌కు మాదిరి ఇండోర్ సైక్లింగ్ కూడా శరీరానికి మంచిదనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. దృష్టి సమస్యలు, బ్యాలెన్సింగ్ రానివారికి ఇండోర్ సైక్లింగ్‌ను సూచిస్తారు. అవుట్డోర్ సైక్లింగ్ వల్ల పొందే లాభాలు మనిషి ఆరోగ్యం మీద అద్భుత ఫలితాలు చూపిస్తాయి. ఎందుకంటే ఇది ఇండోర్ సైక్లింగ్లా స్టాటిక్గా ఉండదు. బయట సైక్లింగ్ చేయడం వల్ల సూర్మరశ్మి శరీరానికి తాకుతుంది. ఫలితంగా కావాల్సినంత విటమిన్ 'డి' అందుతుంది. సైక్లింగ్ అసలు చేయకుండా ఉండడం కన్నా అప్పుడప్పుడు సైక్లింగ్ని ఎంజారు చేసినా శరీరానికి మంచిది. వారంలో మూడు గంటల పాటు సైక్లింగ్ చేసిన మంచి ఫలితం కనిపిస్తుంది. సైక్లింగ్ని దశల వారీగా చేస్తూ సమయాన్ని, దూరాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. అలా కాకుండా ఒక్కసారిగా ముందుకు దూసుకుపోవాలనుకుంటే మాత్రం వాళ్లు కీళ్లనొప్పులతో బాధపడే అవకాశం ఉంది. రోజూ అరగంట పాటు సైక్లింగ్ చే సే వారికి డయాబెటిస్ సమస్య 40 శాతం వరకు తగ్గుతుంది. మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు సైక్లింగ్ చేస్తే మంచిది. ు