Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాత్రంతా టీవీ లేదా స్మార్ట్ ఫోన్లో కాలక్షేపం చేయటం తగ్గించి ఉదయాన్నే నిద్రలేవటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే లేవటం వల్ల రోజంతా ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఉదయాన్నే నిద్రలేచాక కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
- నిద్రలేవాలనుకున్న సమయానికి అరగంట ముందు అలారమ్ సెట్ చేసుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేచాక గోరు వెచ్చని నీళ్ళు లేదా నిమ్మరసం తాగటం వల్ల శరీరంలోని టాక్సిన్లు నశిస్తాయి.
- కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయాలి. అలా చేస్తే శారీరంగానే కాకుండా మానసికంగా కూడా రోజంతా చురుకుగా ఉంటారు.
- రోజు చేయాల్సిన పనుల్ని, ప్రధానమైన విషయాల్ని ఒక కాగితం మీద రాసుకోవాలి. ప్రతిరోజూ ఉదయాన్నే ఇదొక అలవాటుగా మార్చుకుంటే రోజంతా హాయిగా గడిచిపోతుంది. ు