Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరుకులు పరుగుల జీవితంలో పొద్దున లేచిన దగ్గర నుంచి ఆందోళనతో మొదలవుతుంది. ఆఫీసు పని, పిల్లల బాధ్యత, ఇంటిపనులతో త్వరగా అలసిపోతారు. అయితే ఇలా చేయడం ద్వారా అలసట నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు.
- రోజులో చేయాల్సిన పనులను ముందుగా అనుకోవాలి. కబుర్లతో, ఇతర పనులతో సమయం వృథా చేయకుండా ముందు పనులు పూర్తిచేసుకోవాలి.
- ముందురోజు రాత్రి సరిగా నిద్రపోకపోయినా మర్నాడు ఉదయం అలసటగా, బద్ధకంగా అనిపిస్తుంది. అందువల్ల ప్రతిరోజూ రాత్రి దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాలి.
- అలసటకు ఆహారం కూడా ఒక కారణమే. అందుకే జంక్ ఫుడ్ తినడం మానేసి దానికి బదులుగా పండ్లు, కూరగాయలు, గింజలు తినాలి.
- ఒత్తిడికి గురైనప్పుడు తీవ్రమైన అలసట దరిచేరుతుంది. అందువల్ల ఒత్తిడి నుంచి బయటపడడానికి శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు కనీసం పది నిమిషాలపాటు చేయాలి. అలాగే ఆ సమయంలో మీకు ఇష్టమైన పనిచేయడం ద్వారా కూడా ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.
- సాయత్రం ఆరు దాటిన తర్వాత కాఫీ, టీ లాంటివి తాగకూడదు. అవి తాగడం వల్ల నిద్రపై ప్రభావం పడుతుంది.
- ఎక్కడికెళ్లినా వాటర్‌బాటిల్ దగ్గర ఉంచుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. శరీరానికి సరిపడినంత నీరు అందకపోయినా చాలా అలసటగా ఉంటుంది.
- ఆఫీసులో పని అయిపోగానే సాయంత్రం వాకింగ్ చేయాలి. రోజంతా పనిచేయడం వల్ల కలిగిన అలసట వాకింగ్ చేయడం ద్వారా తగ్గుతుంది.