Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంటగదిలోకి వెళ్లాలంటే చాలామందికి ఇష్టముండదు. వంట చేసి ఎప్పుడు బయటపడదామా... అనుకుంటారు. దీనికి కారణం వంటగది శుభ్రంగా, అందంగా లేకపోవడం. కాస్త ఆలోచిస్తే చాలు వంట గదిని చాలా అద్భుతంగా అలంకరించుకోవచ్చు. దీని కోసం ఐదు రంగులను ఎంచుకుంటే చాలు మ్యాజికల్ కిచెన్‌గా మారిపోతుంది. ఆ రంగులేంటో చూద్దామా..!
- గోధుమ, తెలుపు రంగులను వంట గదిలో గోడలకు, కిటికీలకు, తలుపుకు, షెల్ఫ్‌లకు వేసుకోవచ్చు. గదికి ఈ రంగులకు చాలా తక్కువగా ఎంచుకుంటారు. గోధుమ రంగు వంటగదికి వేయడం వల్ల గది మొత్తం ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది.
- తాజాదనం కోసం వంటగదికి ఆకుపచ్చ రంగు వేసుకుంటే బాగుంటుంది. ఈ రంగును కిటికీలకు, తలుపులకు, గోడలకు వేసుకున్నా ఇల్లు అద్భుతంగా కనిపిస్తుంది.
- అలాగే వంటగది గోడలకు తెలుపు, గ్రే కలర్ వేసుకున్నా ఎంతో అందంగా ఉంటుంది. తెలుపు, గ్రే కలర్ గదిలో స్టీల్ పాత్రలు చాలా ప్రత్యేకంగా, శుభ్రంగా కనిపిస్తాయి.
- లేత గులాబీ రంగు గోడలకు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇది వంటగదిలోని ఫర్నిచర్ పై చాలా ఎఫెక్టివ్‌గా కనిపిస్తుంది.
- వంటగది గోడలను, కిటికీలను, తలుపులను, షెల్ఫ్‌లను ఒకటి లేదా రెండు రంగులతో నింపేయడం కన్నా నాలుగైదు రంగులను ఎంచుకుంటే మరింత ఆకర్షణగా కనిపిస్తుంది.