Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంత.. అంటే స్త్రీ అని అర్థం. కానీ కాంత 500 ఏండ్ల చరిత్ర ఉన్న ఓ కుట్టు కూడా. దీని వెనుక అనేక కథలున్నాయి. బుద్ధుడి శిష్యులు నాలుగైదు వస్త్రాలను జత చేసి కుట్టుకుని వాటిని రాత్రి వేళల్లో చలికి తట్టుకునే రగ్గులుగా తయారు చేసుకునేవారట. ఆ తరువాత అదే కుట్టు మహిళలు నాలుగైదు చీరలను కలిపి కుట్టి (బొంతలు)గా పిల్లలకు వాడేవారు కూడా. పాతదేదైనా కాస్త ఆధునికతను అందిపుచ్చుకుంటే డిజైన్‌గా మారిపోతుంది. ఈ కుట్టు కూడా అంతే. ఒకప్పుడు కేవలం ఇంట్లో వస్త్రాలకే వాడినది... తరువాత మేనిపైకి వచ్చి చేరింది. చీరలపై బొమ్మలు, లతలు, ఆకుల రూపంలో ఆవిష్కృతమైంది. ఎందరో బెంగాలీ గ్రామీణ మహిళలు ఉపాధిగానూ మారింది. ఈ మార్పు వెనుక శామ్లూ దుదేజా అనే విప్లవకారిణి అయిన టీచర్ ఉంది. ఈ కళ ప్రాధాన్యాన్ని తెలుసుకున్న ఆమె... 80ల్లో బెంగాల్‌లోని గ్రామీణ మహిళలకు వృత్తిగా నేర్పించింది. అలా ప్రాముఖ్యంలోకి వచ్చిన ఈ కాంత ఎంబ్రాయిడరీ ఇప్పుడు చీరలే కాదు... డ్రెస్ మెటీరియల్స్, దుపట్టాస్, ఫర్నీచర్ మీదకూ చేరింది. దాంతో మగువలు కాంతా దాసులైపోయారు. ఆ కాంత వర్క్ చీరలే ఇవి!