Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెల్లటి కాగితంపై చిన్ని చిన్ని చేతి గుర్తులు ఎంత చూడముచ్చటగా ఉంటాయో కదా! మరీ ఆ గుర్తులను ఫొటో ఫ్రేమ్‌లో అమర్చి గోడలకు తగిలిస్తే వాటి అందం మరింత రెట్టింపు అవుతుంది. అలా కాగితంతో చేసిన చేతి గుర్తులు చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రమే కాదు. ఆ తీపి అనుభూతులు స్నేహానికి చిహ్నంగా, భిన్నత్వంలో ఏకత్వాన్ని, భిన్న సంస్కృతులకు నిలయంగా, మానసిక ఉల్లాసానికి, సృజనాత్మక జ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరెందుకు ఆలస్యం సమయం కుదిరితే వారి చేతికి రంగు రంగుల కాగితాలను, పెయింటింగ్స్‌ను ఇచ్చి స్వేచ్ఛగా ఆడుకోన్విండి. ఇసుకలో పిచ్చుక గూళ్లు కట్టుక్కోవడం, కోతి కొమచ్చు, దాగుడు ముతలు, కాగితపు పడవల.. ఆటలు ఎంత ఆడినా అలసటే రాదు. ఇలాంటి ఆటలు ఒత్తిడిని తగ్గించడంతో పాటు సృజనాత్మక జ్ఞానాన్ని పెంపొందించడంలో ఎంతగానో సహాయపడతాయి.