Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లి కావడమంటే స్త్రీకి మరో జన్మలాంటిది. ఎంత కష్టాన్నైనా బిడ్డకోసం భరిస్తుంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల రీత్యా అత్యంత సహజంగా జరిగే గర్భధారణ అత్యంత క్లిష్టంగా మారిపోయింది. ఎన్ని మందులు వాడినా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. మీరు త్వరగా గర్భం దాల్చాలనుకుంటున్నారా?
- ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా మందులు వాడటం అనివార్యమైపోయింది. మీరు తీసుకునే మందులను మొదటగా వైద్యునికి చూపించాలి. ఇలా చేయటం వలన మీరు గర్భవతి అవకుండా చేసే మందులకు దూరంగా ఉంటారు. ఫలితంగా గర్భాన్ని పొందే అవకాశాలు రెట్టింపు అవుతాయి.
- అధిక స్థాయిలో ఒత్తిడి గర్భం పొందటాన్ని ప్రభావిత పరుస్తుంది. మీరు గర్భాన్ని పొందాలంటే ఒత్తిడిని తగ్గించుకొని, ప్రశాంతంగా ఉండాలి. మీ జీవితంలో ఒత్తిడికి గల కారణాలను తెలుసుకోవాలి. వాటిని తగ్గించుకోటానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా ఒత్తిడి తగ్గించే యోగ, ధ్యానం వంటి పద్దతులను అనుసరించండి.
- వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించటమే కాదు, ఇతర ప్రయోజనాలను కూడా చేకూరుస్తాయి. మంచి వ్యాయామాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యంగా ఉండే వారు త్వరగా గర్భాన్ని పొందుతారు. ఇవి శక్తిని అందించటమే కాకుండా రాత్రి సమయంలో ప్రశాంతమైన నిద్రను మన సొంతం చేస్తాయి.
- గర్భం పొందాలకునే వారు ముఖ్యంగా డ్రగ్స్, ఆల్కహాల్, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలి. గర్భానికి అనువుగా మీ శరీరం మారాలి. కావున అనారోగ్యకర అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రకం అలవాట్లు మొదటి వారంలో పిండం అభివృద్ధికి చాలా సమస్యలకు గురి చేస్తాయని తెలుసుకోండి. కావున, ఇలాంటి అలవాట్లకు తప్పక దూరంగా ఉండండి.
- గర్భాశయంలో పెరిగే శిశువు అన్ని రకాల పోషకాల కోసం మీపై ఆధారపడుతుంది. గర్భం ధరించటానికి ముందే బరువులో సమస్యల గురించి తెలుసుకోండి. అధిక బరువు లేదా బరువు తక్కువగా ఉండటం వంటి వాటి వలన గర్భధారణ, గుండెపై భారం పెరగటం, శిశువుకు పోషకాలు అందటంపై లోపాల వంటి సమస్యలు కలగవచ్చు.