Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలు వేడిచేసేప్పుడే అందులో ఓ చిటికెడు సోడా వేయాలి. అలాగే అయితే త్వరగా పాలుగు విరగవు. విరిగిపోయేందుకు సిద్దంగా ఉన్న పాలు కూడా తాజాగా అవుతాయి.
- పాలు వేడి చేసి కొన్నింటినీ వాడాక ఫ్రిజ్ లో పెట్టేస్తాం. తిరిగి వేడి చేస్తే చాలు విరిగిపోతుంటాయి. అలాంటప్పుడు నేరుగా పాల గిన్నె స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు. పెద్ద గిన్నెలో నీళ్లు పోసి అందులో పాలగిన్నె పెట్టి వేడి చేసుకోవాలి. ఎక్కవ సేపు మరిగించకుండా దించేయాలి.
- పాలు పొంగడం కూడా ఒక సమస్యే. స్టవ్ మీద పాలుపోసి మరొక పని చేయడానికి వీల్లేదు. అక్కడే నిల్చుని అవి పొంగిపోకుండా చూసుకోవాలి. అంతటి శ్రమ లేకుండా పాల గిన్నె అంచుకు కాస్త నూనె రాస్తే... పాలు పైవరకు పొంగవు. అలాగే మార్కెట్లో సిలికాన్తో తయారుచేసిన మూత వచ్చింది. దానికి పాల గిన్నెలో మూత పెట్టినా పొంగవు.