Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంతో సున్నితంగా, సుకుమారంగా ఉండే చిన్నారుల చర్మానికి ఎలాంటి హాని కలిగించని వస్తువులు కావాలని అందరూ కోరుకుంటారు. కానీ వాటిని ఎంపిక చేసుకోవడంలో గందరగోళం ఉంటుంది. ఏది మంచిది? ఏది మంచిది కాదు? ఆందోళన. ఎంతో మృదువుగా ఉండే పసి పిల్లల చర్మానికి... సున్నితమైన బేబీ ప్రాడక్ట్స్ ఉపయోగించడమే ఉత్తమం.
- పిల్లలతో పాటు బాలింతలు కూడా వీలైనంత వరకు సురక్షిత ఉత్పత్తులను వినియోగించడం ఉత్తమం. వీరు కూడా బేబీ ప్రాడక్ట్‌లను ఉపయోగించవచ్చు.
- చాలా బేబీ స్కిన్ కేర్ ప్రాడక్ట్స్‌లో పారాబెన్స్, పాథాలెట్స్ ఉంటాయి. ఇవి చిన్నారులకు ఎలాంటి హాని కలిగించవు. వీటివల్ల రెండు నుంచి మూడేళ్ల వరకు ఉత్పత్తులు పాడవ్వకుండా ఉంటాయి. అలాగే, కొన్ని ఉత్పత్తుల్లో సల్ఫేట్లు ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో వాడతారు. అయితే, వీటిని క్లినికల్‌గా ఆమోదం పొందిన డోసేజ్‌లలో ఉపయోగిస్తే ఎలాంటి హానీ ఉండదు. డోస్ ఎక్కువగా ఉన్నవి వాడకూడదు.
- బేబీ కేర్ ప్రాడక్టులు కొనుగోలు చేసే ముందు అవి ప్రపంచ, స్థానిక సురక్షిత ప్రమాణాలను పాటిస్తున్నాయో లేదో పరిశీలించడం చాలా ముఖ్యం.
- పిల్లలకు సువాసనలు వెదజల్లే ఉత్పత్తులు ఉపయోగించడం అంత మంచిది కాదు. అవి పిల్లలకు అలర్జీలు కలిగించేలా ఉండకూడదు. సువాసనలు వెదజల్లే ఉత్పత్తుల వల్ల పిల్లలకు దురదలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫ్రాగ్రెన్స్ అసోసియేషన్ గుర్తింపు పొందిన వాసనలను మాత్రమే చిన్నారుల ఉత్పత్తుల్లో ఉపయోగించాలి. అలా గుర్తింపు ఉన్న వాటిని మాత్రమే కొనాలి.