Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయంత్రం పూట బాల్కనీలో కూర్చుంటే ఆ హాయే వేరు. అభిరుచి ఉంటే కొంచెం స్థలం ఉన్నా బాల్కనీని ఆకర్షణీయంగా మార్చు కోవచ్చు. అలాంటి కొన్ని టిప్స్ ఇవి...
సాయంత్రం పూట బాల్కనీలో గడపడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఆ సమయంలో కూర్చోవడానికి అనువుగా స్థలాన్ని బట్టి సోఫాను ఎంచుకోవాలి. సోఫా పక్కనే పూల కుండీలు వేలాడదీసుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది.
ఏ సమయంలో ఎక్కువగా బాల్కనీలో గడుపుతారనే దానిపై డిజైనింగ్ ఎంచుకోవాలి. పగలంతా ఆఫీసు వ్యవహారాలతో బిజీగా గడుపుతారు. బాల్కనీలో గడపడానికి రాత్రివేళ మాత్రమే సమయం దొరుకుతుంది. కాబట్టి అలంకరణలో లైటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
గ్రీనరీని ఇష్టపడేవారు బాల్కనీ మొత్తం పచ్చదనంతో నిండిపోయేలా మొక్కలను పెంచుకోవచ్చు. అయితే నీళ్లు బయటకు పోయేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి.
స్థలం ఎక్కువగా ఉన్నట్లయితే బాల్కనీలో ఊయలను అమర్చుకోవచ్చు. మెత్తటి పరుపు, దిండ్లు వేసుకుని సోఫాగా కూడా వాడుకోవచ్చు. బాల్కనీలో స్థలం తక్కువగా ఉన్నట్లయితే జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. తక్కువ స్థలం ఉన్నప్పడు ప్రతి అంగుళం విలువైనదే అవుతుందని గుర్తుంచుకోవాలి.
అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ఫర్నిచర్‌ను ఎంపిక చేసుకోవాలి. స్థలం చిన్నగా ఉంటే కూర్చునేందుకు కుర్చీ ఎంచుకోవచ్చు. కొంచెం స్థలం ఎక్కువగా ఉంటే సోఫాలాంటివి అమర్చుకోవచ్చు.
బాల్కనీ అలంకరణ పూర్తి సపరేట్గా ఉన్నట్లుగా కాకుండా లోపలి గదులతో సింక్ అయ్యేలా మెటీరియల్స్, ఫినిషింగ్ చూసుకోవాలి.
రాత్రివేళ బాల్కనీలో డిన్నర్ చేస్తే సూపర్బ్‌గా ఉంటుంది. అయితే స్థలాన్ని బట్టి డైనింగ్ టేబుల్ లేక టీపారుని ఎంచుకోవాలి. స్థలం ఎక్కువగా ఉన్నవారు డైనింగ్ టేబుల్‌ను పర్మనెంట్‌గా అమర్చుకోవచ్చు.