Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందమైన ముఖాన్ని మరింత అందంగా కనిపించేలా చేసేవి తీరైన కనుబొమలే. కొంతమందిలో కనుబొమలు పలుచగా ఉంటాయి. దాంతో వారు ఐబ్రోపెన్సిన్ను ఉపయోగిస్తారు. అలాకాకుండా కనుబొమలు బాగా పెరిగేలా కొన్ని చిట్కాలు పాటించవచ్చు...
కలబందపై నున్న పొట్టును తీసి లోపలి గుజ్జును కనుబొమలపై అప్లై చేసుకోవాలి. ఇందులో అలోనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కనుబొమ్మలను పెంచడంలో ప్రధాన భూమికను పోషిస్తుంది. దీన్ని రోజుకు రెండు, మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు.
పాలు కూడా కనుబొమలను పెంచడంలో దోహదపడుతాయి. దూదిని పాలలో మంచి కనుబొమలపై అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ పాలను అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఉల్లిగడ్డలను ముక్కలుగా చేసి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్టును కనుబొమలకు అప్లై చేసుకోవాలి. గంట తర్వాత నిమ్మరసంలో ముంచిన దూదితో తుడుచుకోవాలి. దీంతో కనుబొమలు బాగా పెరుగుతాయి. ఉల్లిగడ్డ పేస్ట్‌లో ఉండే సల్ఫర్, మినరల్స్, విటమిన్ 'బి', 'సి' వెంట్రుకలు తొందరగా పెరగడానికి సహాయపడుతాయి.
నిమ్మకాయను సగానికి కట్‌చేసి కనుబొమలపై రుద్దాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. లేదంటే పావుకప్పు కొబ్బరి నూనెలో నిమ్మరసాన్ని పిండి, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అప్లైచేసుకుని ఉదయం కడిగేసుకోవాలి. నిమ్మకాయలో విటమిన్ 'బి', 'సి' , ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది అప్లై చేసుకున్నప్పుడు కొంచెం మంటగా అనిపిస్తుంది. సున్నితమైన చర్మం గలవారు దీన్ని ఉపయోగించకపోవడమే మంచిది. ు