Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమంది గాఢనిద్రలో గురక పెడుతుంటారు. ఇతరులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు గురక పెట్టేవారిలో శ్వాస సంబంధమైన సమస్యలు కూడా వస్తాయి. ప్రారంభంలోనే ఈ గురకను అదుపు చేస్తే.. చాలావరకు సమస్యను నివారించవచ్చు. గురకను నివారించడానికి యోగలో ప్రత్యేక ఆసనాలు ఉన్నాయి. ఉజ్జయి ప్రాణాయామం చేయడం ద్వారా గురక సమస్యను తగ్గించవచ్చు.
ఉజ్జయి ప్రాణాయామం..
సుఖాసనంలో గానీ, పద్మాసనంలో గాని కూర్చోవాలి. నాలుకను వెనుకను మడిచి అంగిలిని తాకాలి. దృష్టిని కంఠంపై ఉంచి గాలి మెల్లగా పీలుస్తూ గొంతుతో చిన్నపిల్లవాడు గురక పెట్టినట్టు శబ్దం చేయాలి. శబ్దం మంద్రంగా ఉండి బయటకు వినపడనంతగా ఉండాలి. శ్వాను పదిసెకన్ల పాటు లోపల ఆపి తర్వాత కుడిముక్కును బొటనవేలితో మూయాలి. ఇప్పుడు ఎడమముక్కుతో శ్వాసను వదలాలి. ఇదే ప్రక్రియ పదిసార్లు చేయాలి.
ఉపయోగాలు..
థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.
గురక తగ్గుతుంది.
అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.
నరాల సమస్యలు తగ్గుతాయి.
ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
జాగ్రత్తలు..
అధిక రక్తపోటు ఉన్నవారు శ్వాసను బిగపట్టవద్దు.
- శ్రీచందన
డిజె ఫిట్నెస్ హబ్
9666665458