Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత జాగింగ్, వాకింగ్‌లాంటివి చేస్తే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. నిద్రలేవగానే గ్లాసు మంచినీళ్ళు తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్ కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
- ప్రతిరోజూ ఉదయాన్ని యాక్టీవ్‌గా ప్రారంభించాలంటే ముందుగా స్నానం చేయాలి. నిద్రలేవగానే స్నానం చేయడం వల్ల బద్ధకాన్ని దూరం చేయవచ్చు.
- నిద్ర మత్తు వదలాలంటే లేచిన వెంటనే సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల నిద్రమత్తు వదిలి శరీరం నూతనోత్సాహాన్ని పొందుతుంది. అంతేకాదు శరీరానికి సహజమైన విటమిన్ డి కూడా అందుతుంది.
- రాత్రిపూట టీవీ ఎక్కువసేపు చూడటం వల్ల రాత్రంతా నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. టీవీ చూడటం వల్ల ఆ వెలుతురు కండ్లపై ప్రభావం చూపుతుంది. అందువల్ల పడుకునేందుకు గంట ముందు టీవీ చూడకపోవడం ఉత్తమం.
- ఇష్టం వచ్చినంత సేపు నిద్రపోకపోవడం వల్ల ఆ రోజంతా మూడీగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఓ నియమం ప్రకారం నిద్ర పోవాలి.