వంటచేసే సమయంలో కొన్నిసార్లు వేడి తగిలి శరీరం మీద బొబ్బలు రావచ్చు. మరికొన్నిసార్లు రసాయన పదార్థాలు, రేడియేషన్ వల్ల కూడా బొబ్బలు రావచ్చు. వీటిని నయం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.. - చర్మం కాలినప్పుడు కనీసం పది నిమిషాల పాటు చల్లని నీరు ధారగా పడేచోట ఉంచాలి. - బొబ్బలను చించే ప్రయత్నం చేయవద్దు. ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉంటుంది. - పసుపులో శుద్ధమైన తేనె కలిపి రాసినా త్వరగా తగ్గుతాయి. - కలబంద గుజ్జును ఒక పొరమాదిరిగా కాలిన గాయాలపై రాయాలి. రోజుకు రెండుసార్లు ఈ రసాన్ని రాస్తే ఎంతో ఫలితం కనిపిస్తుంది. - కోడిగుడ్డులోని తెల్లని సొనలో తుమ్మబంక పొడి, కొబ్బరి నూనె కలిపి పూస్తే ఎంతో ఉపశమనం ఉంటుంది. - కొబ్బరి టెంకెను బాగా కాల్చి దాని చూర్ణాన్ని కొబ్బరి నూనెతో కలిపి బొబ్బలపై రాస్తే త్వరగా తగ్గుతుంది. - గోరింటాకు మెత్తగా చేసి అందులో వెనిగెర్ గానీ, నిమ్మరసాన్ని గానీ కలిపి గాయాలపై పూస్తే మంట తగ్గుతుంది. - కాలిన గాయాలు శరీరంలో 10 శాతం కన్నా మించితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.