Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎందుకే కన్నీళ్ళు కన్నీళ్లు -ఓ కోయిలమ్మా
ఏడ్వకే దీవించు దీవించు-పువ్వుల బతుకమ్మా ||ఎందుకే||
లక్షలు లేకుంటేమి
ప్రేమలు ఉన్నా ఇంట
లచ్చిమై పుడితీవమ్మా
స్వేచ్చతో పెరిగితివమ్మ
తవ్వేడు బిడ్డయినా
తల్లికి ఆసరంటే
ముచ్చటగా పనులోయమ్మ
బుద్దిగా సదువూలమ్మా
ఏ నరుడు మింగేనమ్మ
నాకంటి ఎలుగులాను
ఎవడు తుంచేసేనమ్మా
లేలేత మొగ్గలాను
||ఎందుకే||
ఇంటి సుట్టు ముట్టు
ఏ పుట్టలో ఏ పాము
పొయ్యేటి తొవ్వలల్లా
పొంచుందా ప్రమాదము
సదివే బడిలోగూడా
కదిలే బస్సులో గూడా
భక్షకులు మొదలైరమ్మా
రక్షణలు కరువాయమ్మా
ఆడది అంగడి బొమ్మయి మెరిసెనా కళ్లల్లో
కామాందుల కోరల్లోన అక్కలు సెల్లెళ్లు ... ||ఎందుకే||
సరుకుల్లొ సరుకైనదా
ఆడబిడ్డల ఒళ్ళు
లేదంటె బంధీయేనా
ఇంటింటా సంకెళ్ళు
కట్నాలు కానుకలు
అత్తింటి ఆరళ్ళు
కంటే కనిపెట్టాలంట
మొగరాయుల్లను ఇంట
కాపురానికి ఆడది కడుపునింపే ఆడది
ఆడమొగలు లేని లోకమే యాడుంది
||ఎందుకే||
ఆడబిడ్డలుజేరె
తల్లిగారిల్లు ఉంది
ఆడబిడ్డలు ఆడే
బతుకమ్మ ఆటుంది
ఆడబిడ్డలు పాడె
ఉయ్యాల పాటుంది
కనిపెంచినా తల్లిని
పూజిస్తే అమ్మేనమ్మా
సప్పట్లు సవ్వడిగ ప్రతిఘటిస్తాయమ్మ
సమాన హక్కులాని సాటింపు జేస్తామమ్మ ||ఎందుకే||
అశ్లీలం అంతమయ్యే
పంతమునే పట్టాలి
అత్యాచారాల మీద
యుద్దమే జరపాలి
కులము మతమనె భేదం
కూల్చంగా సాగాలి
మత్తులో ముంచెటోల్ల
చిత్తుజేసెయ్యాలి
ఆడమగ తేడాలు అంతం జేయాలమ్మ
బహుజనులందరు బరిగీసి నిలువాలమ్మ
అప్పుడే ఆనందం ఆనందం - ఓ కోయిలమ్మ ఓ ఎన్నెలమ్మ
ఆడబిడ్డల అస్త్రం కావాలి కావాలి - ఈ బతుకమ్మ
- మిత్ర