Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్షణికావేశం.. జీవితాన్ని చిదిమేస్తుంది. కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించాలి.. ఆత్మవిశ్వాసం గెలుపుకు బాట వేస్తుంది.. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు..
సమస్యలు : ఆర్థిక ఇబ్బందులు.. కారణం ఏదైనా కానీ నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు నేటి తరం యువత. జీవితంలో కష్టాలకు.. సమస్యలకు ఎదురీదకుండా 'చావు' ఒక్కటే పరిష్కారమనుకుంటున్నారు. కష్టాలు వచ్చాయని.. నష్టాన్ని కలిగాయని.. బాధతో.. కక్షలతో విలువైన కాలాన్ని, జీవితాన్ని మరిచిపోతున్నారు. జీవితం ఒక అద్భుతం. దాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి.
ఆత్మహత్యలు అధికం : ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు మరణాల సంఖ్య కూడా అధికం అవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు.. కష్టాలు రావడంతో చావే ఏకైక మార్గమని అనుకుంటున్నారు. ఎదురు దెబ్బలకు తట్టుకుని ధైర్యంగా నిలబడకుండా ఆత్మహత్యలకు పాల్పడడం ఎంతవరకు కరెక్టు. జీవితంలో కష్టాలు వచ్చాయని వాటిని భరించలేమని ఆందోళన చెందుతూ జీవితాన్ని అంతం చేసుకోవడం మంచిది కాదని పరిశోధనలు చెబుతున్నాయి.
బలహీనత : చేసే పనుల్లో నిజాయితీ ఉండేలా, తప్పులు లేకుండా చూసుకోవాలి. ఇతర వ్యక్తులతో చక్కటి సంబంధాలు ఉండేలా చూసుకోవాలి. నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ క్షణంలో బలహీనతలను గుర్తు చేసుకోవద్దు.
భయాన్ని వీడాలి : భయం.. మరింత భయాన్ని కలిగిస్తుంది. భయం చిన్నదైన విజయాలను దరి చేరకుండా చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే భయం నీడలా వెంటాడుతుంది. ధైర్యంగా పోరాడుతు మానసికంగా దృఢంగా ఉండాలి. చిన్న సమస్యకు చావు పరిష్కారం కాదని గుర్తించాలి.
కౌన్సెలింగ్ : తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు.. కౌన్సెలింగ్ చేయాలి లేదా మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకువెళ్తే.. పరిస్థితిలో మార్పు వస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో మానసిక నిపుణులను ఏర్పాటు చేసి సమస్యలను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ఆత్మహత్యలను నివారించే ప్రయత్నం చేయవచ్చు.