Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ బతుకు నుండి పుట్టిన బతుకమ్మ
మన ఆడబిడ్డలకు బంధువై నిలిచిన బొడ్డెమ్మ
అనిక్కాయ ఆకులనే పీటగా వేసీ...
ఎంగిలి పూలతో వాకిట్లకు ఆహ్వానించబడుతూ...
ఏడాది కాలంగా ఎదురుచూసే,
తెలంగాణా బిడ్డల బతుకుల్లో వెలుగులు నింపుటకు
ఊరకలెత్తుతూ... ఎదురేగి వస్తుంది...
మన బతుకమ్మ...!
గునుగు పూలనే బతుకు పూలుగా మలిచి,
తంగేడు పూలతో... తనువంత అలంకరించుకొని,
బంతిపూలతో బంధాలను గుర్తు చేస్తూ...
చెట్టుకు పుట్టకు బిడ్డగా పూసి,
తెలంగాణ ఆడబిడ్డగా ఏటా వచ్చి,
నవరాత్రులు మనతో మమేకమై,
గంగమ్మ ఒడిలోకి చేరుతూ...
తెలంగాణ మట్టిమనుషుల బతుకులకు
పరమార్థాన్ని చెప్పేది బతుకమ్మ...
ఆమే... మన జీవితాలకు బతుకు... అమ్మ...!!
- సూరం అనిల్,
9059457045