Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేళ్లూనుకునే మొక్క అయితే లోతైన కుండీని, లతలా అల్లుకుపోతుంటే ఆధారాన్ని ముందే సిద్ధం చేసుకోవాలి. ఒక్కో మొక్క ఒక్కో రకమైన నేలను ఇష్టపడుతుంది. దానికి అనుగుణంగానే మట్టిని సిద్ధం చేయాలి. మొక్కను నాటడానికి ముందే మట్టిని గుల్లచేసి పోషకాలను కలిపి కుండీలో నింపుకోవాలి. అలానే మొక్క ఎదిగే తీరుని బట్టి కుండీని ఎంచుకోవాలి.
- మొక్కలు కుండీల్లో పెంచుకునేటప్పుడు నీళ్లు పోయడంలోనూ ఇబ్బందులే. అదనంగా పోసిన నీళ్లూ, దాంతో పాటు మట్టి బయటికి పోతుంది. ఆ భయంతో మొక్కకు సరిపడా నీటిని పోయరు. ఈ తీరు మొక్క ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. పరిష్కారంగా కుండీల అడుగున ప్లేట్లు పెట్టుకోవచ్చు. అలానే సెల్ఫ్వాటరింగ్ సిస్టమ్తో కుండీలనూ ఎంచుకోవచ్చు.
- కనీసం పదిహేను రోజులకోసారైనా మొక్క పై భాగంలో ఉండే మట్టిని ఏదైనా పదునైన వస్తువుతో పెకిలించండి. ఇలా చేయడం వల్ల మొక్క వేళ్ల నుంచి గాలినీ, దాన్నుంచి పోషకాలనూ గ్రహించగలుగుతుంది. కుండీల్లో ఉండే మొక్కల ఎదుగుదల కాస్త నెమ్మదిగా జరుగుతుంది. అందుకే తగిన పోషకాలను ఎప్పటికప్పుడు అందించాలి. ఏ మొక్కకు ఎలాంటి మట్టి మేలో....ఎలాంటి పోషకాలను ఎక్కువగా అందిపుచ్చకుంటుందో తెలుసుకోండి. దానికనుగుణంగా ఓ ఛార్ట్ని సిద్ధం చేసుకోండి.
- మొక్కలకు ఎరువులు ఎంత అవసరమో! క్రిమికీటకనాశినులూ అంతే ముఖ్యం. అందుకే వెల్లులి, వేప కషాయాలను సిద్ధంగా ఉంచుకోవాలి. చీడ మొదటి దశలోనే సర్ఫ్ నీళ్లతో మొక్కపై స్ప్రే చేస్తే మంచిది. తప్పదనుకుంటే చెంచా వేపనూనెను, లీటరు నీటిలో కలిపి చల్లుకోవాలి.