Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్యాలను చేరుకోవడానికి... అలుపెరగకుండా పరుగెత్తాల్సినపరిస్థితి ఇప్పుడు. ఈ క్రమంలో అనారోగ్యకరమైన పోటీ కొన్నిసార్లు ఒత్తిడికి గురిచేస్తుంది. దాన్నుంచి బయటపడాలంటే కొన్ని మెలకువలు పాటించాల్సిందే..
సమీక్ష అవసరం: అందరికీ లక్ష్యాలుంటాయి. అయితే ఒకే మూసలో కొట్టుకుపోకూడదంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం సమీక్షించుకోవాలి. మీ బలాలు, బలహీనతల్ని సరిచూసుకోవాలి. అవసరం బలాలకు మరింత సాన పెట్టాలి. ఎక్కడ సమస్య ఉందో దానికి అవసరమైన శిక్షణ, మెలకువలు ఒంట పట్టించుకోవాలి. ఇవన్నీ చేశాకే మీ ప్రణాళిక సిద్ధంచేసుకోవాలి. దీనివల్ల మీ పని సులువవుతుంది. మీరెక్కడ వెనకబడుతున్నారో తెలుసుకునే పరిస్థితీ ఉంటుంది.
అంగీకరించండి: మనలో లోపాలు కనిపిస్తున్నప్పుడు వాటిని అంగీకరించే పెద్ద మనసు మనకుండాలి. లేదంటే మన చుట్టూ ఉన్న ప్రతికూలతలన్నీ మనపై ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో ఇతరులతో పోటీకంటే మనతో మనం పోటీపడటం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి.
పోలిక వద్దు: ఎదుటివారి బలం మన బలహీనత కాకూడదు. ఇతరులతో పోల్చుకుని కొందరు కుంగిపోతుంటారు. అవతలివారి విజయాల్ని యథాతథంగా స్వీకరించలేరు. ఇవన్నీ ఎటువంటి ప్రయోజనం కల్పించవు. వీలైతే వారి విజయానికి కారణమైన అంశాలను గమనించడం మంచిది.