Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. కొంతమందికి పొట్ట జారిపోయి ఉంటుంది. దీన్నే బెల్లీ ఫ్యాట్ అని, టమ్మీ టక్ అని అంటారు. ఒకసారి ఇలా ఫ్యాట్ వచ్చిందంటే అది తగ్గడం చాలా కష్టమైనపని.అయితే దీన్నికరిగించుకోవడానికి ఎక్సర్ సైజులతో పాటు మార్నింగ్ జ్యూస్‌లు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం...
- బెల్లీఫ్యాట్ కరిగించే జ్యూసులు తాగడంతో పాటు, మంచి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను కూడా మెయింటైన్ చేస్తే మరింత మంచిది . రెగ్యులర్ డైట్ నుండి ఆయిల్ , జంక్ ఫుడ్స్ ను పూర్తిగా మానెయ్యాలి.
- ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
- బ్రిస్క్ వాక్ , శారీరక వ్యాయామాలు చేయడం వల్ల క్యాలరీలు అధికంగా కరిగించుకోవచ్చు .
- కీరదోసకాయ, నిమ్మరసం , పుదీనా అల్లం కొద్దిగా నీరు కలిపి జ్యూస్ లాగా చేసుకుని ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ తాగడం మంచిది.
- వెల్లుల్లి రెబ్బలు, తేనే, నిమ్మరసం, గోరువెచ్చని నీటితో కలిపి లెమన్ వాటర్ లాగా తీసుకోవాలి.
- ముల్లంగి ముక్కలు, అల్లం ముక్కలు, నిమ్మరసం, తేనే, దాల్చిన చెక్కపొడితో జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవచ్చు.
- రెండు చెంచాలు అలోవెరా జ్యూస్‌ను ఒక గ్లాసు నీటిలో వేసి, అందులో తేనె మిక్స్ చేయాలి. బ్రేక్ ఫాస్ట్‌కు గంట ముందు దీన్ని తాగాలి.