Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెంతికూరలో ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఔషధ గుణాలెన్నో వున్నాయి. ప్రతిరోజూ ఆహారంలో దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఉడకబెట్టిన మెంతికూర ఆకులు అజీర్ణాన్ని పోగొడతాయి. మందంగా ఉన్న కాలేయాన్ని చురుకుగా పనిచేయిస్తాయి. రక్తహీనతను నివారిస్తాయి. శ్వాసక్రియలోని అవరోధాలు సరిచేస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కీలకమవుతాయి.
మెంతికూరలో క్యాల్షియం, ఇనుము, ఫాస్పరస్తో పాటు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆకలిని పుట్టిస్తుంది.
కీళ్ళ నొప్పులను నయం చేస్తుంది. ఒక గుప్పెడు మెంతి ఆకులను పరోటాలలో, చట్నీలలో వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతాయి.