Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చక్కెరతో చేసే పదార్థాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు చక్కెర తీసుకోవద్దు. అయితే చక్కెరలా తీపిఇచ్చే పదార్థాలు చాలానే ఉన్నాయి. వాటిలో తాటిబెల్లం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చక్కెర కంటే తాటి బెల్లం కొంచెం తక్కువ తియ్యగా ఉంటుంది. దీన్ని చెరుకు రసం, తాటి చెట్టు జిగురుతో తయారు చేస్తారు. దీంట్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.మాంసాహారంలో ఉండే ముఖ్యమైన విటమిన్ బి12 తాటిబెల్లంలో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. తాటిబెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
- భోజనం చేసిన తరువాత శుభ్రంగా నోరు కడుక్కోకపోయినా, పుక్కిలించకపోయినా చిగుళ్ళ సందుల్లో బాక్టీరియా ఉండిపోయి నోరంతా దుర్వాసన వస్తుంది. భోజనం తరవాత తాటిబెల్లం తింటే చెడు వాసన పోగొట్టి , తాజా శ్వాస నింపుతుంది. నోటికి తాజాదనం ఇవ్వడమే కాకుండా సోంపుతో వేసుకుంటే జీర్ణక్రియలో కూడా సహాయం చేస్తుంది.
- గొంతులో గరగర, పొడి దగ్గును నివారించే గుణం తాటిబెల్లంలో ఉంది. ఇందులోని ఔషధ గుణాలు దగ్గు నుంచి తక్షణ ఉపశమనం ఇస్తాయి.
- తాటి బెల్లం, నల్ల మిరియాల పొడి మిశ్రమాన్ని నెయ్యితో కలిపి రాత్రిపూట తీసుకుంటే గొంతు పూత తగ్గిపొతుంది.
- రక్తంలో తక్కువ హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళు రక్తహీనతతో బాధపడుతుంటారు. చర్మం పాలిపోయి, ఎప్పుడు అలసట, నీరసం వంటి సమస్యలతో బాధపడతారు.వీరు తాటి బెల్లం తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెంచడమే కాకుండా రక్త ప్రసరణని పునరుద్ధరిస్తుంది.
- ప్రకృతి వైద్యంలో తాటిబెల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. మెదడు పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. మతిమరుపును నివారించడంతో బాగా పనిచేస్తుంది. మెదడు అలసటను తగ్గిస్తుంది. తాటి బెల్లాన్ని వేడి పాలలో కలిపి పడుకునే ముందు తాగాలి. మతిమరుపును తగ్గించడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది.
- పాలిచ్చే తల్లులకు తాటిబెల్లం బాగా ఉపయోగపడుతుంది. రక్తహీనతని తగ్గించడంతో పాటు పాల ఉత్పత్తిని పెంచుతుంది.